Advertisementt

పవన్ చిత్రంలో నయన తార.?

Thu 13th Oct 2016 04:57 PM
nayanatara,pawan nesan new movie,am ratnam producer,power star pawan kalyan  పవన్ చిత్రంలో నయన తార.?
పవన్ చిత్రంలో నయన తార.?
Advertisement
Ads by CJ

ఏఎం ర‌త్నం నిర్మాతగా నేసన్ దర్శకత్వంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కొత్త సినిమా ద‌స‌రా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ చిత్రం వేదాళం సినిమాకు  రీమేక్‌. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నయనతార నటించబోతుందంటూ టాలీవుడ్ టాక్. ఈ చిత్రానికి గాను  ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌ర‌స‌న నటించేందుకు ఒక నాయికగా న‌య‌న‌తార‌ని ఎంపిక చేసేకుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ చిత్రంలో మ‌రో క‌థానాయిక‌కు కూడా అవకాశం ఉందట. ఆమెనూ ఎంపిక చేసే ప్రయత్నంలో దర్శకనిర్మాతలు వేటాడుతున్నారని తెలుస్తుంది.   అయితే ప‌వ‌న్ కళ్యాణ్, న‌య‌నతార కాంబినేషన్ లో ఈ చిత్రాన్ని నమ్మలేకపోతున్నామంటున్నారు కొంతమంది సినీ గాసిబ్బురాయుళ్ళు. ఇంకో రహస్యమైన విషయం ఏంటంటే తెలుగు సినీ నిర్మాతలు నయనతారను ఎవాయిడ్ చేయాల‌ని చూస్తున్నట్లు కూడా టాక్ వినిపిస్తుందంటున్నారు. అంతే బెట్టుగా న‌య‌నతార వీలైనంత త్వరగా టాలీవుడ్‌కి  బై బై.. చెప్పేద్దామన్న తలంపుతో ఉన్నట్లు కూడా సమాచారం. అందుకే ఈ మధ్య టాలీవుడ్ నుండి అవకాశాల కోసం నిర్మాతలు వెళ్ళినా నయనతార ఒక రాగాన ఒప్పుకోకుండా చుట్టూతా తిప్పుతుందని అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఉన్నట్టుండి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆలోచించాల్సిందే మరి. ఈ విషయంపై చిత్ర యూనిట్ ను అడిగితే డిసెంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసే ఈ చిత్రానికి ఇప్పుడు నుంచే హీరోయిన్ ముచ్చటెందుకంటూ దాట వేస్తున్నారు. కానీ ఈ సినిమాకు సంబంధించి మరో విషయం మాత్రం క్లారిటీగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి టైటిల్ ను స్వయంగా పవన్ కళ్యానే పెట్టాడంట. అదీ రెండు మూడు రోజుల్లో   ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజిస్ట‌ర్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి దీపావళి నాటికి టాప్ మని పవన్ నేసన్ దర్శకత్వంలో వచ్చే సినిమా పేరు కూడా తెలుస్తుందన్నమాట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ