Advertisementt

పి.వి. సింధు ని ఇంక ఆపతరమా..!

Thu 13th Oct 2016 03:04 PM
pv sindhu,rio olympics,brand ambassador,vizag steel,jfw magazine  పి.వి. సింధు ని ఇంక ఆపతరమా..!
పి.వి. సింధు ని ఇంక ఆపతరమా..!
Advertisement
Ads by CJ

ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన పి.వి  సింధు ఏకంగా ఇపుడు పెద్ద సెలబ్రిటీ అయిపొయింది. ఆమెకు వచ్చిన బహుమతులు, నగదు ఆమెని ఎక్కడో కూర్చో బెట్టేశాయి. ఇక సింధు వచ్చే ఒలింపిక్స్ కి కూడా ఇప్పటినుండే తగిన శిక్షణ తీసుకుంటానని ప్రకటించింది. అయితే అటు క్రీడల్లో రాణిస్తూనే ఇటు ఫ్యాషన్ రంగం వైపు కూడా అడుగులు వేస్తుంది. ఈమె ఈ మధ్యన షోరూం ప్రారంభోత్సవాలకు కూడా తెగ అటెండ్ అవుతుంది. ఆ మధ్యన సచిన్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ కారుని బహుమతిగా అందుకున్నప్పుడు కూడా సింధు ఒక ఫ్యాషనబుల్ డ్రెస్ లో హాజరై అందరి చూపుని తన వైపుకి తిప్పేసుకుంది. ఇంకేమిటి అప్పుడే సోషల్ మీడియాలో సింధు ఫ్యాషన్ రంగం లోకి కూడా ఎంటరయిందనే కామెంట్స్ వినిపించాయి.  ఇక తర్వాత ఆమె వైజాగ్ లో జరిగిన కళామందిర్ షాప్ ఓపెనింగ్ లో హీరోయిన్స్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఒక పట్టు చీరలో దర్శనమిచ్చింది. అప్పుడే అందరూ  ఖచ్చితం గా సింధు ఫ్యాషన్ రంగం లోకి  వచ్చేసిందని ఫిక్స్ అయిపోయారు. ఇక నిత్యం ఏదో విధం గా సింధు వార్తల్లో నిలుస్తూ తెగ హడావిడి చేసేస్తుంది.

అయితే  తాజాగా సింధు ఇప్పుడు వైజాగ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడరుగా కూడా సైన్ చేసేసింది. ఇంకేముంది ఆమె రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఆమె క్రేజ్ ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు కవర్ పేజీ లమీద కూడా సింధు ఫొటోస్ దర్శనమిస్తున్నాయి. అంటే ఆమె ఎంతలా ఎదిగిందో తెలిసిపోతుంది. జే.ఎఫ్.డబ్ల్యూ.. జస్ట్ ఫర్ విమెన్ మేగజైన్ లేటెస్ట్ ఎడిషన్ కవర్ పేజ్ మీద  సింధు ఫొటోస్ ప్రచురించారు. ఇక ఈ కవర్ పేజీ మీద సింధు ఫోటో ప్రచురించిన ఈ మ్యాగజైన్స్ లోపల ఆమె మీద ఒక  ఆర్టికల్ ని కూడా ప్రచురించింది. ఈ కవర్ పేజీ  మీద సింధు ని చూసిన వారందరూ ఆమె దగ్గర ఇంత అందం దాగుందా అని అనుకుంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ