Advertisementt

ఈ రికార్డు బాలయ్య, చరణ్ వల్ల కాలేదు..!

Thu 13th Oct 2016 02:20 PM
gautamiputra satakarni,dhruva,janatha garage,teaser record,jr ntr,ram charan,balakrishna  ఈ రికార్డు బాలయ్య, చరణ్ వల్ల కాలేదు..!
ఈ రికార్డు బాలయ్య, చరణ్ వల్ల కాలేదు..!
Advertisement
Ads by CJ

విజయదశమి  కానుకగా బాలకృష్ణ తన 100 చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్ర టీజర్ ని విడుదల చేసాడు. ఇక ఈ ఒక్క టీజర్ తో క్రిష్.. బాలకృష్ణ స్టామినాని  ప్రేక్షకులకి పరిచయం చేసాడు. కేవలం ఒక్క రోజులోనే హిస్టారికల్ మార్కుని ఈ చిత్రం  క్రాస్  చేసేసింది. బాలకృష్ణ పలికిన డైలాగ్స్, బాలయ్య గెటప్, రాజసం, ఆ వార్ సీన్స్ అన్నీ కలగలిపి ఆ టీజర్ అదరహో అనిపించింది. ఇక ఈ చిత్రాన్ని బాలకృష్ణ కి ఒక మైలు రాయి గా నిలవాలని డైరెక్టర్ క్రిష్ బాగా కష్టపడుతున్నాడని ఈ టీజర్ చూడగానే జనాలకి అర్ధమై పోతుంది. మరి ఒక్క రోజులోనే ఈ చిత్ర టీజర్  యూట్యూబ్లో పిచ్చ క్లిక్స్ తో పిచ్చెక్కించేసింది.

అలాగే ఇదే విజయదశమికి రామ్ చరణ్ కూడా తన కొత్త చిత్రం 'ధృవ' టీజర్ తో అభిమానుల పండగని రెట్టింపు చెయ్యడానికి అభిమానులముందుకు వచ్చాడు. 'ధృవ' చిత్రాన్ని సురేంద్ర రెడ్డి చరణ్ హీరోగా తమిళం లో హిట్ అయిన 'తని ఒరువన్' కి రీమేక్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ టీజర్ కూడా ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. ఇందులో చరణ్ డీసెంట్ లుక్ తో చంపేశాడు. భారీ డైలాగ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ టీజర్ కూడా విడుదలైన కొద్దిసేపట్లోనే యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టించింది. 

ఈ ఇద్దరు హీరోలు యూట్యూబ్ లో టీజర్స్ తో కొద్దీ గంటల్లోనే చెలరేగిపోయినప్పటికీ ఒక హీరోకి సాటి రాలేకపోయారు. అతని స్టామినాని అందుకోవటానికి బాగా తడబడ్డారనే చెప్పాలి. ఆ హీరో ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ తాజాగా నటించిన 'జనతా గ్యారేజ్' ఫస్ట్ టీజర్ విడుదలైన కొద్దీ గంటల్లోనే యూట్యూబ్ లో విపరీతమైన వ్యూస్  ని సొంతం చేసుకుంది. మరి బాలకృష్ణ గాని, చరణ్ గాని ఎన్టీఆర్ కి పోటీగా నిలబడలేకపోయారు. ఎన్టీఆర్ జనతా టీజర్ వ్యూస్ ని అందుకోలేక వీరు చతికల పడ్డారనే చెప్పాలి. దీనికి కారణం లేకపోలేదు. అదేమిటంటే బాలకృష్ణ, చరణ్ లు ఒక పండుగని పురస్కరించుకుని అభిమానుల సంతోషం కోసం తమ తమ సినిమా టీజర్స్ ని విడుదల చేశారు. కానీ ప్రేక్షకులు అందరూ దసరా పండగ హడావిడిలో, సంబరాల్లో మునిగిపోయి ఈ హీరోల టీజర్స్ ని వీక్షించడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు కాబట్టే ఇలా జరిగిందనే ప్రచారం జరుగుతుంది. 1 డే లో 1 మిలియన్ వ్యూస్ వచ్చినా.. బాలయ్య, చరణ్ అభిమానులు సంతోషంగా లేరంటే దానికి కారణం ఎన్టీఆర్ రికార్డే అని.. క్లియర్ గా తెలుస్తుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ