Advertisementt

ఈ ప్రేమమ్ తో వాళ్లకి దిమ్మ దిరిగింది..!!

Wed 12th Oct 2016 11:19 PM
premam,tamiliyans,kollywood critics,naga chaitanya,malayalam premam,samantha  ఈ ప్రేమమ్ తో వాళ్లకి దిమ్మ దిరిగింది..!!
ఈ ప్రేమమ్ తో వాళ్లకి దిమ్మ దిరిగింది..!!
Advertisement
Ads by CJ

తమిళ సినిమాలు మలయాళం బిజినెస్ బాగానే చేస్తాయి. మళయాళ సినిమాలు, తమిళనాడులో మంచి కలక్షన్లు రాబడుతుంటాయి. అలాగే ప్రేమమ్ సినిమా తమిళనాడు లో మంచి బిజినెస్ రాబట్టింది.  ఏకంగా ఒక మల్టీప్లెక్స్ లో అయితే రెండు వందల రోజులు నడిచి షాక్ ఇచ్చింది ప్రేమమ్. అంతగా ప్రేమమ్ సినిమా తమిళులకు నచ్చేసింది. అలాగే అదే సినిమా తెలుగులో రీమేక్ గా విడుదలై మంచి కలెక్షన్స్ నే రాబట్టిందని చెప్పాలి.  కానీ కొందరు తమిళులు మాత్రం సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా తెలుగులో ఆడదని.. రీమేక్ చేయడం పెద్ద దండగంటూ ప్రచారం చేశారు. కానీ తమిళంలో కూడా ఈ సినిమా బాగా ఆడుతుంది. తమిళుల ఓవరేక్షన్ కు రియాక్షన్ వసూళ్ళు రాబడుతుంది తెలుగులో రీమేక్ అయిన ప్రేమమ్ చిత్రం. ఇది చక్కటి రీమేక్ అంటూ అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒరిజినల్ చూసిన వాళ్లకూ ఈ సినిమా నచ్చేసింది. తమిళ నెటిజెన్లకు దిమ్మ తిరిగేలా ఇప్పుడు ప్రేమమ్ కలెక్షన్స్ తమిళనాడులో కూడా రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.  

ఇకపోతే మలయాళ ప్రేమమ్ కి తెలుగు రీమేక్ గా వచ్చిన నాగ చైతన్య ప్రేమమ్ చిత్రానికి టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విడుదలైనప్పటి నుండి వరుసగా సెలవులు రావడంతో అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది నాగచైతన్య ప్రేమమ్ చిత్రం. ఈ మధ్య రిలీజైన వాటిలో ఇదొక్కటే పండుగకు సరైన చిత్రంగా వసూళ్ళు దుమ్మురేపుతుంది.  కాగా సునీల్ సినిమా ఈడు గోల్డ్ ఎహే కి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా సినిమాపై వచ్చిన టాక్ నెగెటివ్ కావడంతో అంతగా వసూళ్ల విషయంలో కలిసి రాలేదనే చెప్పాలి. ఇంకా తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కిన అభినేత్రి చిత్రం హరర్ కామెడీ జోనర్ లో ఉన్నా కంటెంట్ పరంగా పర్వాలేదనిపించుకున్నప్పటికీ  వసూళ్ల స్థాయి మాత్రం స్లోగానే ఉంది.  ఇక ప్రేమమ్ మోజులో పడ్డ టాలీవుడ్ ప్రేక్షకులు ఈ పండుగ సందర్బంగా మన ఊరి రామాయణం ను సెకండ్ అప్షన్ గా తీసుకుంటున్నారు. మొత్తానికి ప్రేమమ్ సినిమా వసూళ్ల వర్షంతో ఇటు నాగచైతన్యతో పాటు అతనికి కాబోయే భార్య సమంత కూడా తడిచిపోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ