అగ్రిగోల్డ్ లో డబ్బులు కట్టి తెలుగు రాష్ట్రాలలో ఉన్న పేద వాళ్ళ దగ్గర నుండి బీద వాళ్ళ వరకు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం చేసిన మోసానికి అందరూ ఎన్నో కష్టాల్లో కూరుకు పోయారు. ఇక అగ్రిగోల్డ్ ఆస్తులని వేలం వేసి ఆ డబ్బుని కష్టమర్లకి పంచిపెడతామని కోర్టులు చెబుతున్నప్పటికీ ఇంతవరకు ఆ పని చెయ్యలేదు. ఇక కష్టమర్లే కాకుండా ఏజెంట్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ కోర్టు ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అసలు కొంతమంది ఏజెంట్స్ అయితే కష్టమర్ల ఒత్తిడి తాకలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అసలిప్పటికీ అగ్రిగోల్డ్ బాధితులు నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు చేపడుతూనే వున్నారు. కానీ వారికి న్యాయం మాత్రం జరగలేదు.
ఇక ఇప్పుడు ఏపీ సిఐడి అగ్రిగోల్డ్ బాధితులకి ఒక గుడ్ న్యూస్ వినపించనుంది. న్యాయం కోసం ఎదురు చూస్తున్న లక్షలాదిమంది బాధితులకి అగ్రిగోల్డ్ సంస్థ అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సిఐడి ఒక కొత్త స్టెప్ తీసుకోబోతుందని సమాచారం. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులని సీజ్ చేసిన ఆస్తులని వేలం వెయ్యడానికి రంగం సిద్ధం చేస్తుంది. అగ్రిగోల్డ్ ఆస్తులు 4 రాష్ట్రాలలో విస్తరించి వున్నాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సాలలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులని వేలం వేసి వచ్చిన సొమ్ముని అగ్రిగోల్డ్ లో డిపాజిట్ చేసిన వారికి కట్టి వారికి న్యాయం చెయ్యడానికి రెడీ అయ్యారు సిఐడి వారు. అగ్రిగోల్డ్ కి సంబందించిన రిసార్టులు, పొలాలు, స్ధలాలు, ఇళ్ళు అన్నీ అమ్మి ఆ సొమ్ముని అగ్రిగోల్డ్ బాధితులకి కట్టేయాలని హైకోర్టు ఎప్పుడో చెప్పింది. అది ఇప్పటికి సాధ్యమైందని అంటున్నారు.
ఈ పని ఎప్పుడో చెయ్యాల్సింది... కానీ కోర్టు ఇచ్చిన హామీలు, వేలం వెయ్యడానికి కొంచెం టైం పట్టడం వలన ఇంత జాప్యం జరిగింది. మరి ఇప్పటికైనా వారు కట్టిన సొమ్ము వారికి గనక దక్కితే వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతాయి.