Advertisementt

సచిన్ తో ఇప్పించిన గిఫ్ట్ వెనక్కి ఇచ్చేస్తుంది..!

Wed 12th Oct 2016 06:48 PM
sachin,deepa karmakar,chamundiswari nath,rio,car gift,return  సచిన్ తో ఇప్పించిన గిఫ్ట్ వెనక్కి ఇచ్చేస్తుంది..!
సచిన్ తో ఇప్పించిన గిఫ్ట్ వెనక్కి ఇచ్చేస్తుంది..!
Advertisement
Ads by CJ

గత నెలలో రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన పి.వి.సింధు, సాక్షి మాలిక్, దీపా కర్మాకర్ లు భారతదేశం నుండి ఎన్నో బహుమతులు అందుకున్నారు. వారికి నగదు రూపేణా నే కాకుండా ఇంకా వస్తువులు, స్థలాల రూపేణా కూడా బహుమతులు లభించాయి. అయితే వీరందరికి చాముండేశ్వరి నాథ్‌ బహుమతి రూపం లో బీఎండబ్ల్యూ కార్లను సచిన్ చేతుల మీదుగా అందించాడు. అలాగే పివి. సింధు కోచ్ పుల్లెల గోపీచంద్ కి కూడా సచిన్ చేతుల మీదుగా బీఎండబ్ల్యూ ని అందించారు. ఈ వేడుక హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో కన్నుల పండుగగా జరిగింది.

అయితే ఇప్పుడు ఈ బహుమతుల గురించి  ప్రధానం గా చర్చిన్చుకునేది ఎందుకంటే ఈ బీఎండబ్ల్యూ కారుని అందుకున్న ఒక క్రీడాకారిణి ఆ కారుని వెనక్కి ఇచ్చేయాలని అనుకుంటుందట. ఆమె ఎవరో కాదు జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి మన్ననలు పొందిన దీపా కర్మాకర్. అయితే అందరూ అంతమంచి కారును దీపా కర్మాకర్ వెనక్కి ఇచ్చేయడం ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారట. అసలు  దీపా కర్మాకర్ ఈ బీఎండబ్ల్యూ కారును ఎందుకు వెనక్కి తిరిగి ఇచ్చేయాలనుకుంటుంది అంటే.... ఆమె ఆ కారుని మెయింటింగ్ చెయ్యలేక అంట. అలాగే అగర్తలా రోడ్లపైన ఇంత కాస్టలీ కారుని తిప్పడం కష్టమైన పని అని , అగర్తలా రోడ్డుపై ఎక్కువగా గుంతలు, గతుకులు ఉంటాయి కాబట్టి కారు పాడవుతుందని.... ఇక ఇంటి దగ్గరే పెట్టుకున్న కూడా కారు పాడైపోతుందని దీప ఈ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. ఇక కారుకి సర్వీసింగ్ చేయించాలన్నా అసలు అగర్తలా లో కనీసం బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేదట. అందుకే దీప ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఇక ఈ విషయాన్ని దీప తన కోచ్ బిశ్వేస్వర్ నంది కి తెలియజేసిందట. అయితే ఆవిడ ఈ విషయాన్ని చాముండేశ్వరి నాథ్ దృష్టికి తీసుకెళ్లగా అయన పర్వాలేదు కారు వెనక్కిచ్చేసిన ఇబ్బంది లేదు అని.... కారు ఖరీదు చేసే డబ్బుని దీపకి ఇచ్చేద్దామని అయన చెప్పారని కోచ్ బిశ్వేస్వర్ నంది మీడియా కి తెలియజేసారు. ఇక ఈ విషయం పై దీపని మీడియా కలవాలనుకున్నప్పటికీ ఆమె అందుబాటులో లేదని చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ