తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యను తమిళ స్టార్ హీరో ధనుష్ 2004లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు యాత్రా అనే ఒక కుమారుడు ఉన్నాడు. యాత్రా పుట్టినరోజు సందర్భంగా ధనుష్ ఇంట్లో ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అక్టోబర్ 10వ తేదీ యాత్రా పుట్టినరోజు. పూజా కార్యాక్రమంలో భాగంగా ధనుష్ తన కుమారుడిని గట్టిగా హత్తుకొని తల నిమురుతూ అలా తదేకంగా చూసుకొంటూ మురిసిపోయాడు. పక్కా తమిళ సంప్రదాయంలో జరిపిన ఆ పూజా కార్యక్రమంలో అమ్మవారి సమీపంలోనే ఆ బర్త్ డే బాయ్ యాత్రాతో కలిసి ధనుష్ తీసుకున్న ఫోటోను ఫేస్ బుక్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ధనుష్ మా బాబు అప్పుడే ఎంత పెద్ద వాడయ్యో చూడండి అంటూ ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేశాడు. ఇంకా కుమారుడి గురించి ప్రస్తావిస్తూ మా వాడు మనస్సు అప్పుడే బొమ్మలపై నుండి గాడ్జెట్లపైకి మళ్ళిందంటూ చెప్పుకొని మురిసిపోయాడు ధనుష్.