Advertisementt

విజువల్ వండర్ లా గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్.!

Wed 12th Oct 2016 04:08 PM
gowtami putra shatakarni movie,gowtami putra shatakarni teaser,gowtami putra shatakarni hero balakrishna,gowtami putra shatakarni movie visual wonder dasara release gowtami putra shatakarni teaser  విజువల్ వండర్ లా గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్.!
విజువల్ వండర్ లా గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్.!
Advertisement
Ads by CJ

బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి టీజర్ ని విజయదశమి కానుకగా ఈ రోజు ఉదయం 11 గంటలకి విడుదల చేసింది చిత్ర బృదం. ఈ ట్రైలర్ చూసినవారు ఒక విజువల్ వండర్ లోకి వెళ్ళిన అనుభూతికి లోనవుతున్నారు. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని ఎంతో ఎఫర్ట్ పెట్టి తీస్తున్నట్లుగా ట్రైలర్ ను చూస్తే అర్ధమైపోతుంది. క్రిష్ తనలోని టాలెంట్ ని అంతా రంగరించి మరీ ఈ సినిమాని బాలయ్యకి ఒక మరిచిపోలేని గిఫ్ట్ గా ఇవ్వాలని రెడీ అయిపోయాడని ఈ టీజర్ చూసిన వాళ్లకి ఇప్పటికే అర్ధమైపోయింది. బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణిలో ఎంత యాక్టీవ్ గా ఉన్నాడంటే తన ఏజ్ ని మర్చిపోయి నటించేసాడా.. అన్న  తీరుగా రాజసం, కోపం కలగలిపిన నటన కనబర్చి అందరిని మైమరపింపజేశాడనే చెప్పాలి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ లలో బాలకృష్ణ కిరీటం లేని రాజుగా చూపించిన క్రిష్ ఈ టీజర్ లో గ్రాఫిక్స్ వండర్ తో చితక్కొట్టేసి ఈ సినిమాపై భారీ అంచనాలను అమాంతంగా పెంచేసాడనే చెప్పాలి. ఈ టీజర్ లో బాలకృష్ణ పలికిన డైలాగ్స్ అదరహో అనిపించేలా వున్నాయి. విశ్రాంతి లేదు.. విరామం లేదు.. మా కత్తికి అంటిన నెత్తుటి చార.. ఇంకా పచ్చిగానే ఉంది.. సమయం లేదు మిత్రమా.. శరణమా.. రణమా అంటూ బాలకృష్ణ అలా డైలాగ్స్ చెబుతుంటే ఇక్కడ  నందమూరి అభిమానులకు భూమి మీద కాలు నిలవడం లేదంటే నమ్మండి. మామూలుగానే బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్ డెలివరీ పీక్ స్టేజ్ లో ఉంటుంది. మరి ఈ గౌతమీ పుత్ర శాతకర్ణిలో బాలకృష్ణ ఎలా రెచ్చిపోయి నటిస్తాడో అన్నది కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యడానికి క్రిష్ - బాలకృష్ణ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ