తెలంగాణా రాష్ట్ర చరిత్రలోనే ఈరోజుకు ప్రత్యేకత ఉంది. చాలా చిరస్మరణీయమైన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణా ప్రజలకు ఓ అపురూపమైన కానుకనిచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం మండలాలను జిల్లాలుగా మార్చి 21 కొత్త జిల్లాలతో మొత్తం 31 జిల్లాల రాష్ట్రంగా తెలంగాణా పునర్నిర్మాణ దిశగా పునరంకితమౌతుంది. ప్రధానంగా కేసీఆర్ సొంత ప్రాంతంగా సిద్దిపేట ప్రజలు ఈ అపూరూప సన్నివేశంలో మునిగి ఆనంద పరవసులవుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... సిద్ధిపేటను జిల్లాగా మార్చడమన్నది తన 40 ఏళ్ల నాటి కల అని తెలిపాడు. దాదాపు 1985 నుండి 2004 వరకు సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ సిద్దిపేటను జిల్లాగా చేయాలని అప్పటి ముఖ్యమంత్రులను పలుమార్లు ఒత్తిడి తెచ్చానని అదృష్టవశాత్తు అది ఇప్పటి తన అధికారంలో జిల్లాగా రూపొందుతుందని ఆయన వివరించాడు.
తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఇప్పుడు ఈరోజు సిద్ధిపేట జిల్లాను ప్రారంభించి తన 40 ఏళ్ళనాటి కళను నెరవేర్చుకున్నాడు. కేసీఆర్ గతంలో తెలంగాణ అభివృద్ధి కోసమని పలువురు ముఖ్యమంత్రుల వద్దకు తిరిగి తిరిగి ప్రాధేయపడటం అలా కాదని తన అనుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధన తర్వాత తనే ముఖ్యమంత్రిగా ఈ అవకాశాన్ని తనకే రావటం ఎంతో గర్వకారణంగా చెప్పుకున్నాడు. కాగా తెలంగాణలో మొత్తం 31 జిల్లాలతో సుపరిపాలన దిశగా కేసీఆర్ అభివృద్ధి పథంలో పడాలని ఆశిద్ధాం.