Advertisementt

శ్రీరస్తు శుభమస్తు ఆడి కార్ ప్రాప్తిరస్తు..!

Tue 11th Oct 2016 08:58 PM
allu sirish,srirasthu subhamasthu,allu arjun,allu sirish twitter,audi car gift  శ్రీరస్తు శుభమస్తు ఆడి కార్ ప్రాప్తిరస్తు..!
శ్రీరస్తు శుభమస్తు ఆడి కార్ ప్రాప్తిరస్తు..!
Advertisement
Ads by CJ

శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో కాస్త సినిమా లైన్లో పడటంతో కుమారుడిపై అల్లు అరవింద్ కు మమకారం ఎక్కువైంది. అల్ల శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా తన నటనను పండించి పర్వాలేదు శిరీష్ కూడా హీరోగా పనికొస్తాడు అనిపించుకున్నాడు. దాంతో అల్లు శిరీష్ పై తండ్రికి ఎక్కడలేని ప్రేమానురాగాలు, మమతాను బంధాలు పెళ్ళుబికాయి. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు శిరీష్ కు పుత్రవాత్సల్యంతో చాలా ఖరీదైన బహుమతిని అందించాడు. దసరా పండుగను పురస్కరించుకుని శిరీష్ కు తన తండ్రి అల్లు అరవింద్ ఆడి క్యూ7 కారును బహుమతిగా అందజేశాడు.

ఈ మధ్యనే శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఘన విజయం సాధించటంతో ఆ ఆనందంలో నుండి అరవిందే ఇంకా తేరుకోలేదు. ఇదే విషయాన్ని ఆ తర్వాత జరిగిన పలు సందర్భాల్లో అల్లు అరవింద్ వ్యక్తీకరించాడు. అదే ఆనందంలో ప్రస్తుతం అరవింద్ ఆ కారును కానుకగా ఇచ్చి ఉండవచ్చని చాలా మంది అంటున్నారు. అయితే ఈ సందర్బంగా శిరీష్ మాట్లాడుతూ  ఆడి క్యూ7 కారంటే తనకెంతో ఇష్టమని, ఇలాంటి సమయంలో ఈ కారును తాను నాన్న వద్దనుండి పొందడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని అల్లు శిరీష్ వివరించాడు. కాగా అన్నయ్య అల్లు అర్జున్ సమక్షంలోనే కారు తాళాలను తన తండ్రి నుంచి తీసుకుంటున్న ఫొటోను శిరీష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ