Advertisementt

ధోని బార్యపై 420 కేసు..!

Tue 11th Oct 2016 08:08 PM
sakshi,dhoni wife,case on sakshi,dhoni wife case on 420  ధోని  బార్యపై 420 కేసు..!
ధోని బార్యపై 420 కేసు..!
Advertisement
Ads by CJ
క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారుండరు. ధోని మైదానం లో ఆడుతున్నాడు అంటే అభిమానులు పిచ్చెక్కి కేరింతలు కొట్టేస్తారు. అతను అటు క్రీడా రంగంలోనే కాక ఇటు వ్యాపార రంగం లో కూడా అంతే రాణిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ధోని సాక్షిని  ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక పాపకి తండ్రి కూడా అయ్యాడు. ఇక పెళ్ళైన దగ్గర నుండి ధోని భార్య కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అటు భర్త, పాపని చూసుకుంటూనే ఇటు వ్యాపార రంగంలో కూడా రాణిస్తుంది.
అయితే బిజినెస్ వ్యవహారాల్లో భాగంగా  సాక్షిపై 420 కేసు నమోదైంది. తనకు రావాల్సిన మొత్తాన్ని తనకు ఇవ్వకుండా మోసం చేసారంటూ డెనిస్ అరోరా అనే అతను గుర్గావ్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడం తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు అసలు ఎందుకు నమోదైంది అంటే రోహిత్ ఎంఎస్ డి అల్మోడ్ ప్రై.లిమిటెడ్ అనే సంస్థకు 4 ఋ డైరెక్టర్స్ వున్నారు. ఈ డైరెక్టర్స్ లో ఒక డైరెక్టర్ ధోని భార్య సాక్షి. అయితే  రోహిత్ ఎంఎస్ డి అల్మోడ్ ప్రై.లిమిటెడ్ కి స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ అనే కంపెనీలో షేర్స్ వున్నాయి. ఇంకా మిగిలిన డైరెక్టర్స్ లో ఒకరైన  డెనిస్ అరోరా స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ లో తనకు వచ్చిన వాటా మొత్తాన్ని అమ్మేయాలని నిర్ణయించుకోవడంతో దానికి బదులుగా 11 కోట్లు ఇస్తామని సాక్షి, ఇంకా మరో డైరెక్టర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఇక  డెనిస్ అరోరా తనకు రావాల్సిన 11 కోట్లకు గాని కేవలం 2.50 కోట్లు మాత్రమే కట్టారని, ఇంకా మిగిలిన డబ్బు ఇవ్వకుండా తనను మోసం చేశారని అంటున్నాడు. అసలు మార్చి కల్లా తన పూర్తి డబ్బు తనకు చెల్లించాలని కానీ ఇన్ని రోజులైనా ఇప్పటివరకు కట్టక పోవడం  వల్లనే తాను కేసు పెట్టి కోర్టుకి ఎక్కాల్సి వచ్చిందని చెబుతున్నాడు. మరి సాక్షికి ఆ మరో డైరెక్టర్ కి ఈ 11 కోట్లు పెద్ద విషయం కాదు. కానీ అవి ఎందుకు కట్టలేదు? ఇంత చిన్న మొత్తానికి పరువు పోయేలా ఆ కేసులు గోలేమిటో...! వాళ్ళకే తెలియాలి.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ