Advertisementt

అవినీతి అంటుంటే గమ్మనుండవోయ్ అంటుండు.!

Tue 11th Oct 2016 06:58 PM
guntur mp rayapati sambasivarao,ap chief minister chandrababu naidu  అవినీతి అంటుంటే గమ్మనుండవోయ్ అంటుండు.!
అవినీతి అంటుంటే గమ్మనుండవోయ్ అంటుండు.!
Advertisement
Ads by CJ

తెలుగుదేశం పార్టీ నాయకుల సమక్ష్యంలోనే ఎప్పుడూ లేనంతగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుంటూరు జిల్లా వినుకొండలో శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రామాన్ని పురస్కరించుకొని మాట్లాడిన ఆయన ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తే సీఎం చంద్రబాబు తనపై అక్షింతలు వేస్తారంటూ నవ్వుతూనే.. తేదేపా నాయకుల అవినీతి, ఆగడాలపై నోరు జారాడు.

తెదేపా నాయకుల సమక్ష్యంలోనే ఎన్నడూ లేనంతగా అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని  ఆయన వివరించాడు. తెదేపాలోని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల చిట్టా మొత్తం చంద్రబాబు వద్ద ఉందని,  గుంటూరు జిల్లాలో అందరూ మైనస్ గ్రేడ్‌లలోనే ఉన్నారని ఆయన చెప్పాడు. ప్రతి ఒక్కరి అవినీతి చిట్టా చంద్రబాబు తెప్పించుకున్నారన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ కావటం చాలా కష్టసాష్యంతో కూడుకున్నదని, అన్ని వసతులున్న గుంటూరుకు జోన్‌గా మార్పు చేయటం సులభమని ఈ విషయాన్ని చాలా సార్లు తాను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినా ఆయన నువ్వు గమ్మునుండవోయ్..అంటున్నాడన్నాడని రాయపాటి తెలిపాడు. విశాఖకు ఏ విధంగానూ రైల్వే జోన్ రాదని, వారి చేసే  పోరాటం వృథా అవుతుందని రాయపాటి వెల్లడించాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ