Advertisementt

ప్రేమమ్ తో నాగచైతన్య, సమంత అలా పొంగిపోయారు.!

Tue 11th Oct 2016 04:36 PM
samantha,nagachaitanya,premama movie,new coupe danc,samanatha new dance,samantha romance nagachaitanya  ప్రేమమ్ తో నాగచైతన్య, సమంత అలా పొంగిపోయారు.!
ప్రేమమ్ తో నాగచైతన్య, సమంత అలా పొంగిపోయారు.!
Advertisement
Ads by CJ

సినీపరిశ్రమలో టాప్ హీరో, హీరోయిన్ లు ఇద్దరూ సరైన వయస్సులో ప్రేమించికొని పెళ్ళాడితే ఎలా ఉంటుంది. నిజంగా అలాంటి అనుభవాన్ని, ఆనందాన్ని చవిచూస్తున్నారు సమంత, నాగచైనతన్యల జంట. ప్రేమమ్ విడుదలై మంచి రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర యూనిట్ అందరికంటే ముందుగా సమంత తెగ సంబరపడిపోతుంది. ఈ విషయాన్ని సమంత తను మెట్టినింటికి పోయే ముందు తన ద్వారా కలిసొచ్చిన అదృష్టంగా భావిస్తూ తెగ మురిసిపోతుంది.  ఆ ఆనందంతో సమంత ఫుల్ ఖుషీఖుషీగా ఎంజాయ్ చేస్తంది. తన ప్రియుడు, కాబోయే భర్త తాజాగా నటించిన ప్రేమమ్ చిత్రం ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె అమితానందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా ఈ సినిమా విడుదల రోజునే సమంత  ట్విట్టర్లో స్పందిస్తూ.. తనకు ఎగరాలో, ఏడవాలో, నవ్వాలో తెలీయని ఓ రకమైన ఆనందభాష్పాలు వస్తున్నాయంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సమంత తాజాగా నాగ చైతన్యతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తూ చిందులేసి మరీ ఫోటోలో దొరికిపోయింది.

కాగా ఈ పార్టీకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో సమంత ఫుల్ జోష్ తో మ్యూజిక్ కు అనుగుణంగా డాన్సులు వేస్తుంటే నాగ చైతన్య, సమంతను చూస్తూ అప్పుడప్పుడలా చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడని టాక్. కానీ సమంత మాత్రం ఈ పట్టరాని ఆనందంతో చాలా చిన్న పిల్లయిపోయి  పట్టరాని అమితానందంతో అలిసిపోయే దాకా డ్యాన్స్ చేసి కాస్త నీళ్లులాంటివి ఏవో తాగి  మరీ మళ్ళీ నాగచైతన్యకు హుషారు తెప్పించేలా డ్యాన్స్ చేసిందని మాత్రం తెలుస్తుంది. మొత్తానికి ప్రేమమ్ పేరుతో ఈ కొత్త ప్రేమ జంట పార్టీలో చెలరేగిపోయారు. 

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ