Advertisementt

30 ఇయర్స్ ఇండస్ట్రీకి కష్టమొచ్చింది.!

Tue 11th Oct 2016 01:27 AM
pruidvi,comedian prudhvi,police case,30 years industry  30 ఇయర్స్ ఇండస్ట్రీకి కష్టమొచ్చింది.!
30 ఇయర్స్ ఇండస్ట్రీకి కష్టమొచ్చింది.!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ కామెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీగా ప్యాచుర్యం పొందిన పృథ్వీ మంచి ఫామ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అలాంటి పృథ్వీకి ఇప్పుడు కష్టమొచ్చిది. పృథ్వీ చాలా కాలంగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా   ఈ మధ్యేనే మంచి పాత్రలు వస్తున్నాయి. అస్సలు 30 ఇయర్స్ ఇండస్ట్రీ కోసమే తెలుగు సినీ పరిశ్రమలోని రచయితలు, దర్శకులు ప్రత్యేకంగా పాత్రలు సృష్టించి పంచ్ డైలాగ్ లు రాస్తున్నారంటే నమ్మసఖ్యం గానీ అంశం. అలాంటి పృథ్వీకి ఈ మధ్య వినాయక చవితి సందర్భంగా షూటింగ్ దెబ్బతగిలి కాస్త విశ్రాంతి తీసుకున్నాడు.  అయితే ఉన్నట్టుండి ఇప్పుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీపై 420 కేసు నమోదైంది. కాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఓ మహిళ పృథ్వి తనను పెళ్లి చేసుకుని మోసం చేశాడని పిర్యాదు చేసింది.

పోలీసుల వెంటనే ఈ విషయంపై స్పందించి ఆయనపై 498 , 420 కేసులు నమోదు చేశారు. ఈ వార్త ప్రసుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నడుస్తోంది. తీరా చూస్తే పృథ్వీపై కేసు పెట్టిన ఆమె వాళ్ళ ఒకప్పటి పని మనిషి అంట. ఈ విషయంపై పృథ్వీ స్పందిస్తూ తనకు ఏ పాపం తెలియదని,  తనపై ఎదో కుట్ర  జరుగుతుందన్న అనుమానం వస్తుందని ఇదంతా ఎవరు చేయిస్తున్నారో తెలియడం లేదని వెల్లడించారు. అయితే మొత్తానికి పృథ్వీ అప్పట్లో ఏం చేశారో ఏమోగానీ ఇలా కేసు పెట్టిన ఆమె అలా కేసును విత్ డ్రా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నదని కూడా టాక్ వినిపిస్తుంది. కానీ మొత్తానికి ఆ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందన్నది మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ