Advertisementt

వాళ్ళ మధ్య విభేదాలా? నో వే.!

Mon 10th Oct 2016 10:22 PM
iswarya rai,amitabh bachin family,family war iswary and amitabh bachin family,salman khan  వాళ్ళ మధ్య విభేదాలా? నో వే.!
వాళ్ళ మధ్య విభేదాలా? నో వే.!
Advertisement
Ads by CJ
ఐశ్వర్య ఫ్యామిలిలో విభేదాలు వచ్చి వారి మధ్యన గొడవలు జరుగుతున్నాయని ఈ మధ్య బాలీవుడ్ మీడియా దగ్గర నుండి అన్ని మీడియాలు ఒకటే న్యూస్ లు ప్రచురించాయి. ఐష్ కి, బచ్చన్ ఫ్యామిలీకి అస్సలు పొసగడం లేదని అలాగే అభిషేక్ తో ఐష్ తరచూ గొడవ పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఈ గొడవలు కూడా ఐశ్వర్య రాయ్ రీసెంట్ గా చేస్తున్న ఒక ఫిలిం యే దిల్ హై ముష్కిల్ కోసమని, అందులో ఐష్ హద్దులు దాటి నటించినందు వల్లే ఐష్ మామ గారైన అమితాబచ్చన్ కి బాగా కోపం వచ్చిందని, ఇంకా అత్తగారు జయకి కూడా ఐష్ అంటే పీకలదాకా కోపం ఉందని ఏవేవో రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇది నిజమనే ఆధారం ఒక్కటి కూడా మీడియా చేతికి దొరకలేదు. కానీ ఐశ్వర్య ఫ్యామిలీ గురించి న్యూస్ మాత్రం ఘాటుగా అన్ని సోషల్ మీడియాలలో ప్రముఖంగా వినిపిస్తూ హాట్ హాట్ గా కనిపిస్తుంది. 
ఇక అభిషేక్ కూడా ఈ మధ్యన జరిగిన ఒక సంఘటన వల్ల ఐష్ మీద తీవ్రమైన కోపంతో వున్నాడని అంటున్నారు. ఆ కారణం ఏమిటంటే ఐష్ మాజీ ప్రేమికుడు సల్మాన్ తో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకోవడంతో తన భర్తతో కూడా ఐష్ కి విభేదాలు మొదలయ్యాయని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. అయితే ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ ఐష్ తన భర్త, మామ అమితాబ్ తో కలిసి ముంబై లో జరిగిన దుర్గా పూజకు తన కూతురు ఆరాధ్యతో సహా హాజరైంది. మరి ఆ పూజలో అందరూ కలిసి పాల్గొని అందరి నోళ్ళకి తాళం పడేలా చేశారు బచ్చన్ ఫ్యామిలీ వాళ్ళు.
అభిషేక్ బచ్చన్ కుటుంబంతో సహా అందరూ కలిసి దుర్గా పూజలో పాల్గొని మా మధ్యన ఏ విభేదాలు లేవని చెప్పకనే చెప్పేశారు. అసలు వీళ్ళ మధ్యన ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అని  ఆలోచించేవాళ్లకి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఐశ్వర్య, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఆరాధ్యల ఫొటోస్ గనక చూస్తే ఇంత అన్యోన్యం గా వున్న వీరి మధ్య గొడవలేమిటబ్బా  అనకోక మానరు.
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ