విజయ దశమి పండుగతో పాటు తెలంగాణా రాష్ట్రంలో కొత్త జిల్లాల పండగ కూడా ఊపందుకుంది. కొత్త జిల్లాలకు సంబందించిన అధికారిక ఉత్తర్వులను విడుదల చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అర్థరాత్రిని ముహుర్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఆరోజు రాత్రి 12: 45 నిముషాలకు మొత్తం 31 జిల్లాల జాబితాను ప్రకటించనున్నారు. దీంతో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ఘట్టం ప్రారంభమౌతుంది. అందుకోసం ముందుగా సోమవారం నాడు సంబంధిత అధికారులకు అన్ని రకాల సమాచారాన్ని ఇవ్వనన్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని లెక్కలను సినీజోష్.కామ్ ముందుగానే ప్రకటించింది. http://www.cinejosh.com/news-in-telugu/4/31978/30-telangana-new-districts-telangana-new-districts-kcr-telangana-state-ktr.html
ఇక ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లను నియమించే విషయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తతం కలెక్టర్లగా పని చేసే వ్యక్తుల పని తీరును బట్టి వారికి ర్యాకింగులు ఇచ్చి వాటి ద్వారా అన్ని విధాలా సమర్థులైన వారిని కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రకంగా ఒక జాబితాను ప్రభుత్వం రూపొందించినట్లు తెలుస్తుంది. కాగా సోమవారం అర్థరాత్రి మొదలయ్యే పనులు మంగళవారంతో పూర్తి స్థాయిలో రంగం సిద్ధం కానున్నదన్న మాట.