Advertisementt

అల్లు అర్జున్ ఈ సాహసం మళ్లీ చేస్తాడా..!

Sun 09th Oct 2016 08:55 PM
allu arjun,vakkantham vamsi,introduce,sukumar  అల్లు అర్జున్ ఈ సాహసం మళ్లీ చేస్తాడా..!
అల్లు అర్జున్ ఈ సాహసం మళ్లీ చేస్తాడా..!
Advertisement
Ads by CJ

వక్కంతం వంశీ.. ప్రస్తుతం తెలుగులో ఉన్న స్టార్‌రైటర్లలో ఒకరు. కాగా ఈయనకు జూనియర్‌ అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే వక్కంతం వంశీకి ఎన్నో డైరెక్షన్‌ ఆఫర్లు వచ్చినా తారక్‌తోనే తన అరంగేట్రం చేయాలని భావించాడు. దానికి తోడు ఎన్టీఆర్‌ సైతం వంశీ మొదటి చిత్రంలో హీరోగా తాను నటిస్తానని మాట ఇచ్చివున్నాడు. కానీ ఆయనను ఏళ్లకు ఏళ్లు వెయిట్‌ చేయించిన వక్కంతం వంశీ మాత్రం తాను ఇప్పటికే ఎంతో కీలకమైన సమయాన్ని వృథా చేసుకున్నానని మధనపడుతున్నాడు. ఆల్‌రెడీ నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా తన తమ్ముడు ఎన్టీఆర్‌ హీరోగా వక్కంతం వంశీ చేయబోయే చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా డిజైన్‌ చేయించారు. కానీ 'జనతా గ్యారేజ్‌' సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోన్న ఎన్టీఆర్‌ తన తదుపరి చిత్రానికి వక్కంతం వంశీతో ప్రయోగం చేయకుండా అనుభవం ఉన్న డైరెక్టర్‌తోనే చేస్తే మేలని భావిస్తున్నాడు. దీంతో వక్కంతంకు మరోసారి ఎన్టీఆర్‌ హ్యాండిచ్చాడని స్పష్టమవుతోంది.కాగా ఇటీవల వంశీ తాను ఎన్టీఆర్‌ కోసం తయారుచేసుకున్న అద్భుతమైన కథను అల్లుఅర్జున్‌ కి చెప్పి ఒప్పించి ఆయన దగ్గర నుండి గ్రీన్‌సిగ్నల్‌ అందుకుంటున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైనా కూడా బన్నీ కోసం మరో ఏడాది ఆగకతప్పని పరిస్దితుల్లో ఉన్నాడు వంశీ. ప్రస్తుతం ఆయన హరీష్‌శంక్‌తో 'డిజె', ఆ తర్వాత లింగుస్వామితో తెలుగు, తమిళలలో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నాడు.. ఆ తర్వాత మాత్రమే వంశీ చిత్రం ఉండనుంది. ఇంతకీ బన్నీ కూడా వరుస విజయాల్లో ఉండి ఈ వక్కంతం ప్రాజెక్ట్‌ను చేస్తాడా? తన కెరీర్‌లో ఇప్పటివరకు సుకుమార్‌తో 'ఆర్య' చిత్రం ద్వారా మాత్రమే బన్నీ కొత్తవారికి అవకాశం ఇచ్చాడు. మరి వక్కంతంతో ఆ హిస్టరీని రిపీట్‌ చేస్తాడా? లేదా? అన్నది వేచిచూడాల్సిన అంశం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ