హిందువుల సెంటిమెంట్ ప్రకారం ఇంటికి కొత్త కోడలు వచ్చాక శుభపరిణామం జరిగితే ఆ క్రెడిట్ కోడలికే దక్కుతుంది. ఇలాంటి క్రెడిట్ సమంతకు లభించింది. నాగచైతన్యతో ప్రేమాయణం జరుపుతూ, పెళ్లి వరకు తెచ్చిన సమంత త్వరలో నాగార్జున ఇంటి కోడలు కాబోతోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి వరకు ఫ్లాప్‌ల పరంపర ఎదుర్కొంటున్న నాగచైతన్యకు సక్సెస్ వచ్చింది. ఇది 'ప్రేమమ్' సినిమా ద్వారా సాధ్యమైంది. సమంతతో ప్రేమలో ఉన్నపుడే ఈ సక్సెస్ రావడంపట్ల చైతూ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే కొత్త కోడలు గోల్డెన్ లెగ్‌గానే వారు భావిస్తున్నారట.