Advertisement

బాలయ్యో...లుక్ అదిరిందయ్యో...!

Sat 08th Oct 2016 08:55 PM
balakrishna,gautamiputra satakarni,gautamiputra satakarni balakrishna look,balayya,gspk  బాలయ్యో...లుక్ అదిరిందయ్యో...!
బాలయ్యో...లుక్ అదిరిందయ్యో...!
Advertisement

బాలకృష్ణ 100 వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ ని దసరా కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో బాలకృష్ణ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే అభిమానుల సంబరాలు దసరా కన్నా ముందే జరుపుకోవాలని భావించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' యూనిట్ బాలకృష్ణ లుక్ ని రిలీజ్ చేసేసింది. అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ శ్రీయ లుక్ ని ఇప్పటికే విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు  తాజాగా బాలకృష్ణ లుక్ ని కూడా 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్ర యూనిట్ విడుదల చేసేసింది. ఇక ఈ ఫొటోలో బాలకృష్ణ ఒక బంగారు సింహాసనంపై  కూర్చుని సింహం నెత్తిన చెయ్యి పెట్టి రాజసం ఉట్టిపడేలా ఈ లుక్ ని తయారు చేశారు. అసలు రాజుగారు అంటే ఇలానే ఉంటాడా అని అనిపించేలా బాలకృష్ణ ఈ లుక్ లో అదరగొడుతున్నాడు. ఇక ఈ చిత్రం టీజర్ ని విజయదశమి రోజున విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ బాలకృష్ణ లుక్ తో సంబరాలు చేసుకుంటున్న నందమూరి అభిమానులు ఇక వచ్చే టీజర్ తో ఇంకెంత సంబరాలు చేసుకోవడానికి రెడీ అవుతారో మరి. ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా శ్రీయ నటిస్తుండగా....రాజమాతగా బాలీవుడ్ నటి హేమ మాలిని నటిస్తుంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement