Advertisementt

రకుల్ బిజినెస్ ఓ రేంజ్ లో ఉందిగా..!

Sat 08th Oct 2016 08:19 PM
rakul preet singh,f45 fitness center,rakul preet singh movies,rakul preet actress  రకుల్ బిజినెస్ ఓ రేంజ్ లో ఉందిగా..!
రకుల్ బిజినెస్ ఓ రేంజ్ లో ఉందిగా..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఒక రేంజ్ లో  దూసుకుపోతుంది రకుల్ ప్రీత్ సింగ్. చిన్న పెద్ద హీరోలు అనే తారతమ్యం లేకుండా అందరితో జోడి కడుతూ తెగ బిజీ అయిపొయింది. ఇక ఇప్పుడు రకుల్ చేతిలో పెద్ద హీరోల సినిమాలతోపాటు హీరో సాయి ధరమ్ తేజ వంటి యంగ్ హీరోల సినిమాలు కూడా వున్నాయి. ఇటు 'ధ్రువ' చిత్రంలో చరణ్ పక్కన నటిస్తూనే.... ఎప్పటినుండో మహేష్ పక్కన హీరోయిన్ గా నటించాలని కలలుగన్న తనకు మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో చేసే సినిమాలో మహేష్ కి జోడి గా ఛాన్స్ కొట్టేసింది. ఇక సాయి  సినిమా ఎలాగూ చేతిలో వుంది. అంత బిజీలోనూ రకుల్ తాను చేసే  వ్యాపారం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు వుంది. రకుల్ ఏం వ్యాపారం చేస్తుందనేగా మీ డౌట్. రకుల్ ఆ మధ్యన 'ఎఫ్ 45' ఫిట్నెస్ సెంటర్ ఒకటి హైదరాబాద్ లో టాలీవుడ్ సెలబ్రిటీస్ సమక్షం లో ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ జిమ్ సెంటర్ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట. మరి ఒక్క హైదరాబాద్ లోనే  అలా ఉంటే మిగతా చోట్ల  కూడా ఈ సెంటర్ ఓపెన్ చేస్తే బావుంటుందని... అందుకే ఇంకా బ్రాంచ్ లను ఓపెన్ చెయ్యడానికి రకుల్ ప్లాన్ చేస్తుందట.  ఇక ఈ ప్లాన్ లో భాగం గానే చెన్నై, ముంబై, బెంగుళూరు వంటి సిటీస్ లో ఈ 'ఎఫ్ 45' ఫిట్నెస్ సెంటర్ బ్రాంచ్ లని విస్తరించే పనులను చేస్తుందని సమాచారం.

ఇక అటు సినిమాలతో బిజీ అయిపోయి సేమ్  టైములో బిజినెస్ ని కూడా అలాగే డెవలెప్  చేస్తూ రకుల్ యమా స్పీడ్ అనిపించుకుంటుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ