Advertisementt

లక్ష్మీబాంబుని అలుసుగా చూస్తున్నారేమో!

Sat 08th Oct 2016 08:14 PM
laxmi bomb,laxmi bomb movie trailer review,manchu lakshmi prasanna  లక్ష్మీబాంబుని అలుసుగా చూస్తున్నారేమో!
లక్ష్మీబాంబుని అలుసుగా చూస్తున్నారేమో!
Advertisement
Ads by CJ

ప్రముఖ హీరో మోహన్ బాబు కూతురుగా పరిశ్రమలోకి వచ్చిన మంచు లక్ష్మీ నటిగా, నిర్మాతగా, యాంకర్ గా దూసుకుపోతుంది. లక్ష్మీ మేముసైతం అంటూ ఓ కార్యక్రమం నడుపుతూ దాని ద్వారా ఎందరో అభాగ్యులకు చేయూత నందిస్తుంది. ఇకపోతే దొంగాట త‌ర‌వాత‌ మంచు ల‌క్ష్మీకి మరో సినిమా లేదు. ఓ యేడాది త‌ర‌వాత మంచు ల‌క్ష్మీ హీరోయిన్ గా వస్తున్న సినిమా ల‌క్ష్మీబాంబ్‌. ఈ చిత్రానికి కార్తికేయ గోపాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు చెందిన ట్రైల‌ర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. దాన్ని చూస్తుంటే అన్నీ కలగలిపి తీసిన చిత్రంగా వినిపిస్తున్న టాక్. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ గా ఉన్నా, థ్రిల్లింగ్‌, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌, హార‌ర్‌, కామెడీ ఇలా అన్నీ కలగూర గంపలా కలిసిమెలిసి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో  ‘బాహుబ‌లికి రాజ‌మౌళి కూడా ఇంత స్క్రిప్టు రాసుండడు’ అంటూ ఇండస్ట్రీ ఆల్ టైమ్ హిట్ బాహుబ‌లి గురించి ఈ ట్రైల‌ర్‌లో ప్ర‌స్తావించ‌డం అందరినీ అశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంకా చివరలో మోహ‌న్ బాబు లెవిల్లో అమ్మాయే క‌దా అని అలుసుగా చూస్తున్నారేమో.. ల‌క్ష్మీ – జ‌స్టిస్ ల‌క్ష్మీ అంటూ ఓ డైలాగ్ ను బాంబులా పేల్చింది. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పాత్రలో  విభిన్న వైవిధ్యాలు కనిపిస్తున్నాయి. ఇందులో పోసాని ఉన్నాడు కాబ‌ట్టి కామెడీ బాగానే పండవచ్చు.

అయితే ట్రైల‌ర్ చూస్తుంటేనే అన్నీ కలగలిపినదిగా దర్శనమిస్తుంది. థ్రిల్లరా, న్యాయ వ్య‌వ‌స్థ‌పై వేస్తున్న సెటైరా అనే దానిపై క్లారిటీ లేదు. అన్నీ కొంచెం.. కొంచెం కలిపి వండిన భోజనంలా ఉండవచ్చు అనిపిస్తుంది. ఈ దీపావ‌ళికి విడుదలయ్యే ఈ సినిమా ఎలాంటి బాంబును పేలుస్తుందో వేచి చూడాలి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ