చీటికీ మాటికీ బారత్- పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న విషయం తెలిసిందే. దాయాదుల మధ్య పోరు ఎప్పటికి ముగుస్తుందో ఏమో తెలియదు కాని ఇరు దేశాల మధ్య భారీగా జననష్టం వాటిల్లుతుంది. కానీ కొంతలో కొంత అయితే పటిష్ఠంగా ఉంటే తప్పు ఇక పాక్ తో తట్టుకోలేమని భారత్ పాక్ సరిహద్దు మధ్యలో కంచె కట్టాలనే గొప్ప, సంచలనాత్మకమైన నిర్ణాయాన్ని తీసుకుంది కేంద్రం. 2017 డిసెంబర్ నాటికి భారత్- పాక్ సరిహద్దును పూర్తిగా మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించాడు. సెక్యూరిటీ గ్రిడ్ పేరుతో ఏర్పాటు చేసే ఈ కొత్త విధానం ద్వారా సరిహద్దు వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు కనిపెట్టవచ్చని ఆ విధంగా పాక్ ను ఎదుర్కోగలమని ఆయన వివరించాడు.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలోని సైనిక ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపాడు. దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజపడే ఉద్దేశమే లేదని, ప్రజలు కూడాను సైన్యం పట్ల విశ్వాసాన్ని కనబరచాలని రాజ్ నాథ్ సింగ్ తెలిపాడు.