Advertisementt

సునీల్..వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది!

Sat 08th Oct 2016 12:38 PM
sunil,khaidi no 150,chiranjeevi,pawan kalyan,sunil movies  సునీల్..వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది!
సునీల్..వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది!
Advertisement
Ads by CJ

సునీల్ హీరో అయినప్పటి నుండి కమెడియన్ గా అందరికి దూరమయ్యాడు. ఇక హీరోగానే సెటిల్ అవ్వడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే వున్నాడు. ఇక సునీల్.. చిరంజీవిని తన అన్నయ్యగా సినిమా ఇండస్ట్రీలో అందరికి చెప్పుకుంటూ ఉంటాడు. ఇక అలాంటి అన్నయ్య చిరంజీవి  పిలిచి తన 150 సినిమాలో తన పక్కన చెయ్యడానికి అడగగా... ఎగిరి గంతేసి ఒప్పుకున్న సునీల్ వెంటనే ఆ ఆఫర్ ని కాదనుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే అప్పుడు వెంటనే చిరు 150 వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో సునీల్ ప్లేస్ లోకి అలీ ని తీసేసుకున్నారు. ఇక సునీల్ 'ఈడు గోల్డ్ ఎహే' సినిమాలో బిజీ అయిపోయాడు. అయితే ఇప్పుడు సునీల్.. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ సినిమాలో ఒక రోల్ చేస్తున్నాడని టాక్ బయటికి వచ్చింది. మరి అన్న సినిమా కాదని తమ్ముడి సినిమాలో సునీల్ చేస్తున్నాడని అప్పుడే సెటైర్స్ వేసేస్తున్నారు చాలా మంది. అయితే ఈ వార్తలకి స్పందించిన సునీల్ నేను అన్నయ్య సినిమాని వదులుకోవడానికి ఒక కారణం ఉందని చెప్పాడు. ఆ కారణం ఏమిటంటే అన్నయ్య 150 వ సినిమాలో నేను చెయ్యడానికి డేట్స్ ప్రాబ్లెమ్ వచ్చాయని చెప్పాడు. తన 'ఈడు గోల్డ్ ఎహే' సినిమా క్లైమాక్స్ చేసే డేట్స్, 150 వ చేసే షూటింగ్ డేట్స్ ఒకేసారి రావడం తో అన్నయ్య సినిమా నుండి డ్రాప్ అయ్యానని అంటున్నాడు. ఇదిలా ఉండగా సునీల్  పవన్ - త్రివిక్రమ్ సినిమాలో చేస్తున్నాడో లేదో మాత్రం కన్ఫర్మ్ చెయ్యలేదు.

Click Here for Eedu Gold Ehe Movie Review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ