కార్తీ, శ్రీదివ్య, నయనతార హీరోహీరోయిన్లుగా, గోకుల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కాష్మోరా. అనుష్క రుద్రమదేవిలా దర్శనమిచ్చినట్లు, కాష్మోరా అనే చిత్రంలో నయనతార రత్నమహాదేవిలా కనువిందు చేయనుంది. ఈ కాష్మోరా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాష్మోరా అనే టైటిల్ గద్దలతో చాలా బాగా డిజైన్ చేయబడింది. నయన తార, శ్రీదివ్య ఇద్దరూ ఈ చిత్రంలో కథానాయికలు. కార్తి కూడా ఈ చిత్రంలో సరికొత్త అరాచకాన్ని సృష్టించే వేషంలో కనిపించి భయపెట్టనున్నాడు.
కాష్మోరా చిత్రం షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తి కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పోస్టర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్స్ కు సోషల్ మీడియా నుంచి మంచి స్పందన వస్తుంది. ఇందులో నయనతార రత్నమహాదేవిలా, వీరనారీమణిలా, అమిత పరాక్రమం కలిగిన ధీర వనితలా వీక్షకులను ఎమోషన్ కు గురి చేస్తుంది. అయితే కాష్మోరా ఫస్ట్ లుక్ తోనే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ముందు ముందు ఎన్ని సంచలనాలకు దారితీస్తుందో అంటున్నారు సినీజనం. పీవీపీ, డ్రీమ్ వారియర్స్ పిక్సర్చ్ బ్యానర్ పై పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, కెవిన్ అన్నే, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు కలిసి సుమారు రూ. 80 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కబాలి సినిమాకి సంగీతం అందించిన సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. కాగా కాష్మోరాను తమిళం, తెలుగు భాషలలో ఒకేసారి దీపావళి కానుకగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.