Advertisement

బాహుబలి మీడియా కేమీ..?

Thu 06th Oct 2016 08:11 PM
bahubali,media,telugu media,free publicity,ss rajamouli  బాహుబలి మీడియా కేమీ..?
బాహుబలి మీడియా కేమీ..?
Advertisement

మీడియాను ఉచితంగా వాడుకుని, తద్వారా తమ సినిమాకు ప్రచారం చేసుకుని, మార్కెటింగ్ చేసుకునే కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టిన ఘనత దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళికి చెందుతుంది. బాహుబలి నిర్మాణంలో ఉండగా, దాని గురించి ఎలాంటి వివరాలను యూనిట్ చెప్పనప్పటికీ  మీడియా హైప్ క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్లో అసక్తి కలిగేలా కథనాలు రాసింది. ఇంత చేసిన మీడియాకు బాహుబలి యూనిట్ మెుండిచేయి చూపింది. ఇలాంటి హై బడ్జెట్ సినిమా మీడియాకు ప్రకటనలు ఇవ్వకుండా ముఖం చాటేసింది. కొన్ని మీడియా సంస్థలకే ఇంటర్య్వూలను పరిమితం చేసింది. మళ్లీ ఇదే  ప్రణాళికను బాహుబలి 2 కోసం రాజమౌళి రచించినట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోవాలంటే మీడియా ద్వారానే సాధ్యం. దీని కోసం ఆయన విలేకరుల సమావేశం పెట్టి సినిమా వివరాలను ప్రకటించారు. తమ సినిమా గొప్పదనాన్ని నాన్ స్టాప్ గా చెప్పుకొచ్చారు. ఇదంతా మార్కెటింగ్ చేసుకోసుకునే ఎత్తుగడ. అంటే మళ్లీ మీడియాను ఉపయోగించుకుంటున్నారన్నమాట.  తీరా సినిమా రిలీజ్ సమయంలో ముఖం చాటేస్తారు. ఆ విధంగా మీడియాను వాడుకుని వదిలేయడం అనే విద్యను ఆయన పరిశ్రమకు కొత్తగా పరిచయం చేస్తున్నారు. తొలి ప్రెస్ మీట్ లోనే మీడియా పట్ల ఆయన వైఖరి తెలిసింది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విలేఖరుల సమావేశానికి వచ్చారు. ఇక ఈ సినిమాను  ఇతర భాషల్లోకి అనువాదం చేస్తారు కాబట్టి అక్కడి మీడియాను ప్రత్యేకంగా పిలిపించి , సినిమా వివరాలు చెప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థానికంగా ఉండే తెలుగు మీడియాకు మాత్రం కనీసం ఇంటర్య్వూ ఇవ్వరు. 

రాజమౌళి తీరుపట్ల గతంలోనే మీడియా నిరసన వ్యక్తం చేసింది. అయితే కొత్త హంగులతో ఒక తెలుగువాడు తీస్తున్న సినిమా కాబట్టి తమ బాధ్యతగా మీడియా బాహుబలి 2 గురించి విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తెలియజేస్తూనే ఉంది. ఈ విషయాన్ని జక్కన్న గుర్తిస్తారా....?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement