నమస్తే తెలంగాణ పేపర్ గురువారం హడావుడి చేసింది. మంత్రి శ్రీనివాసయాదవ్ బర్త్ డే అంటూ ప్రకటనలు గుప్పించింది. ఇవి మిగతా పేపర్లలో కనిపించలేదంటే ప్లాన్ ప్రకారమే జరిగిందనుకోవచ్చు. అంటే ముందుగానే బర్త్ డేకు ఆదాయ మార్గాలను వెతుక్కున్నారు. వారిని సంప్రదించి తమకే ప్రకటనలు వచ్చేలా ప్లాన్ చేశారు. మంత్రి పేషీ నుండే ఇది జరిగిందంటున్నారు. తెలంగాణ మంత్రి కాబట్టి తెలంగాణ పేపర్ కే ప్రకటనలు ఇచ్చే విధంగా ఒత్తిడి తెచ్చేలా చేశారని అంటున్నారు. మంత్రిగారికి కూడా సమయం కలిసి వచ్చింది. తన ఫాలోయింగ్ ను రెన్యూవల్ చేసుకునే ప్రయత్నం చేశారన్నమాట. చాలా మంది మంత్రుల బర్త్ డేలు వచ్చినా యాదవ్ మాదిరిగా హడావుడి మాత్రం ఉండేది కాదు. హైదరాబాద్ కే చెందిన యాదవ్ కు లోకల్ మంత్రిగా పేరుంది. అయితే ఇటీవలే కేటీఆర్ పురపాలక మంత్రి కావడంతో ఆయన హైదరాబాద్ లో చక్రం తిప్పుతున్నారు. మీడియా కూడా కేటీఆర్ పర్యటనలు ప్రాధాన్యతనిస్తోంది. దీంతో లోకల్ కు చెందిన యాదవ్, పద్మారావు, నాయని వంటి వారికి ఇంపార్టెన్స్ తగ్గిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పైగా మంత్రి యాదవ్ కు సినిమాటోగ్రఫీ, మత్య్స శాఖ లు ఉండడం వల్ల హడావుడి తక్కువ. దాంతో నగరంలో తన ప్రాభవాన్ని అలాగే కొనసాగించడానికి బర్త్ డేను ఉపయోగించుకున్నారు. విచిత్రం ఏమంటే మా, ఫిల్మ్ ఛాంబర్ సైతం గ్రీటింగ్స్ చెబుతూ ప్రకటనలు విడుదల చేసింది. కేసీఆర్ బర్త్ డేకు సైతం ఇలా ఇవ్వలేదు. ఇదంతా ప్రణాళికా బద్దంగా జరిగిందని మా సభ్యుడొకరు అన్నారు. తెలంగాణ మంత్రులకు గ్రీటింగ్స్ చెప్పాలంటే నమస్తేకే ప్రకటనలు ఇవ్వాలన్మమాట. అనధికారింగా అది ప్రభుత్వ పత్రికగా చలామణి అవుతోంది.