కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు మాట ఇచ్చి నిలబెట్టుకోలేక పోతున్నాడని కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నాడు. కాపు రిజర్వేషన్ల కోసం ఊరూరా ఉద్యమాలు చేద్దామని ఆయన వెల్లడించాడు. చివరి సారి జరిపే పోరాటానికి ముందు దశల వారీగా ఊరూరా ఉద్యమాలు జరిపి ఆందోళనలు చేపట్టాలని ఆయన వివరించాడు. ఊరురూ ఉద్యమానికి దశదిశా నిర్దేశించుకొనేందుకు ముద్రగడ ఓ సమావేశాన్ని నిర్వహించాడు.
కాగా దాసరి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ కాపులను చంద్రబాబు వీధిల్లోకి నెట్టివేస్తున్నాడని వివరించాడు. కాపు జాతిని రోడ్లమీదకు తెచ్చిన చంద్రబాబుతో అమీ తుమీ తేల్చుకునే వరకు తాము నిద్రపోమన్న విషయాన్ని ప్రస్తావించాడు ముద్రగడ. కాపు నాయకులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దిశగా అడుగులు వేస్తూ కనీసం 15రోజులకు ఒక్కమారైనా ఆందోళనలు చేపట్టాలని ఆయన కోరాడు.