జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండేళ్ళలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు, పవన్ వేస్తున్న అడుగులు చూడబోతే అందులో సందేహమే కలగడం లేదు. పవన్ ఓ విప్లవవాదిలా నిరంతరం సమాజం గురించే తపిస్తున్నాడన్నట్లు ఆయన మాటలు వింటే అర్థమౌతుంటుంది. ఆయన ఓ తాత్వికుడిగా ఆయన చేస్తున్న కార్యకలాపాలు, చదువుతున్న పుస్తకాలు, రాస్తున్న పేజీలు, వెల్లడిస్తున్న మాటలను బట్టే అట్టే తెలిసిపోతుంది. కాగా పవన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు నిర్మాణాత్మకమైన ధోరణిని అవలంభిస్తున్నట్లు వెల్లడౌతుంది. అందుకు పవన్ అభిమానులు సోషల్ మీడియాలో జనసేన తరఫు నుండి చాలా చురుకుగా స్పందిస్తున్నారు. అలా స్పందించడమే కాదు నిరంతరం జనసేన వార్తా స్రవంతి కొనసాగుతుంటుంది, ఇక నుండి జనసేన యూ ట్యూబ్ ఛానల్ ను చూడండి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గురించి తాజా విషయాలు, వార్తలు, పవన్ అడుగులు, ఆలోచనలు, జనసేన పార్టీ సేవలు, పార్టీ మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సి వ్యూహాలు, తాజా రాజకీయాలను ఎలా ధీటుగా ఎదుర్కొని ముందుకు పోవాలన్న విషయాలను వెల్లడించేలా 'జనసేన మనసేన' అంటూ సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రచారాన్ని మొదలెట్టేసింది.
కాగా జనసేన పార్టీ కార్యకర్తలు, పవర్ స్టార్ అభిమానులు పవవ్ రాజకీయ పరమైన జనసేన పార్టీ తాజా విషయాలన్నీ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడిస్తామని వివరించారు.