ఎప్పుడూ కాకమీద ఉండే పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మధ్య శాంతంగా మారారు. ఉడీ ఉగ్రవాదుల అరాచకానికి భారత్ ప్రతి దాడికి దిగిన నేపథ్యంలో పాక్ కాస్త శాంతిస్తుంది. అంతే కాకుండా అంతర్జాతీయంగా కూడా పలు దేశాలు పాక్ కుట్రలను తీవ్రంగా పరిగణించి పాక్ ను దోషిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలతో పాక్ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. పాకిస్తాన్ పార్లమెంటు సాక్షిగా నవాజ్ షరీర్ మాట్లాడుతూ భారత్ తో ముడిపడి ఉన్న కాశ్మీర్ సమస్యే కాకుండా అన్నీ శాంతియుతంగా చర్చల ద్వారానే పరిష్కరించుకుందామంటున్నాడు. పాక్, బారత్ తో యుద్ధం చేయాలని కోరుకోవడం లేదని, ఒకవేళ అనుకోని పరిణామాలు సంభవించి అవి యుద్ధానికి దారితీస్తే తామేం చేయలేమని చేతులెత్తేశాడు నవాజ్ షరిప్.
అసలు ఉడీ దారి జరిపింది తాము కాదని, ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని నవాజ్ షరీప్ అన్నాడు. కానీ ఉడీ దాడి జరిగిన కొన్ని నిమిషాలకే పాక్ ఆ దాడికి పాల్పడిందంటూ పాక్ పై నింద మోపిందని ఆయన వెల్లడించాడు. కాగా పాక్ జరిపిన ఈ దాడి నేపథ్యంలో అన్ని దేశాలు పాక్ ను మొట్టికాయ వేస్తుండటంతో ఏం చేయలేని స్థితిలో పాక్ ప్రధాని నవాజ్ షరీప్ బారత్ పై యుద్ధానికి సంసిద్ధంగా లేమని, ఏమన్నా ఉంటే శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకుందాం అంటూ వెల్లడించాడు.