Advertisementt

కొత్త గెటప్ లో బన్నీ ఎలా వున్నాడు?

Wed 05th Oct 2016 09:15 PM
allu arjun,dj,linguswami film allu arjun new look,allu arjun dj getup  కొత్త గెటప్ లో బన్నీ ఎలా వున్నాడు?
కొత్త గెటప్ లో బన్నీ ఎలా వున్నాడు?
Advertisement
Ads by CJ

ఏ ముహూర్తాన మెగాస్టార్‌ చిరంజీవి అల్లుఅర్జున్‌కి స్టైలిష్‌స్టార్‌ అని బిరుదు ఇచ్చాడోగానీ తన ప్రతి చిత్రంలో అల్లుఅర్జున్‌ తన వివిధ రకాలైన స్టైల్‌తో, మేకోవర్‌లతో అందరినీ మెప్పిస్తున్నాడు. ప్రతి చిత్రానికి ఆయన ఇందులో చూపించే మేనజరిమ్స్‌ అందరినీ అలరిస్తున్నాయి. తాజాగా ఆయన 'రేసుగుర్రం, రుద్రమదేవి, సన్నాఫ్‌ సత్యమూర్తి, సరైనోడు'.. ఇలా ప్రతి చిత్రంలో ఆయన వేషధారణ, మేనరిజమ్స్‌ అదిరిపోయేలా ఉన్నాయి. కాగా ప్రస్తుతం బన్నీ త్వరలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. అందులో దిల్‌రాజు నిర్మాతగా , హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో ఆయన చేయనున్న 'డీజె' చిత్రం ఇదే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక మార్చి నెల నుంచి ఆయన లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రం చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఇటీవల అల్లుఅర్జున్‌ గెటప్స్‌ రెండు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫొటోలలో బన్నీ హెయిర్‌స్టైల్‌ వినూత్నంగా ఉంది. మరి ఈ గెటప్‌లను ఆయన అభిమానులు సృష్టించినవో, లేక బన్నీ తదుపరి చిత్రానివో తెలియదు కానీ ఈ లుక్స్‌ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక 'డీజె' కోసమే కాదు.. బన్నీ లింగుస్వామి దర్శకత్వంలో చేయబోయే చిత్రంలో బన్నీ గెటప్‌ కాస్త తమిళుల గెటప్స్‌కు దగ్గరగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ