Advertisementt

త్రివిక్రమ్ ఈసారి పవన్ పై దేవుడి ప్రయోగం!

Wed 05th Oct 2016 08:51 PM
devude digivachhina,pawan kalyan,trivikram srinivas,katamarayudu  త్రివిక్రమ్ ఈసారి పవన్ పై దేవుడి ప్రయోగం!
త్రివిక్రమ్ ఈసారి పవన్ పై దేవుడి ప్రయోగం!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తమిళ 'వీరం' రీమేక్‌గా 'కాటమరాయుడు' చిత్రం చేస్తోన్న సంగతి తెలిసిందే. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం డాలీ దర్శకత్వంలో శరత్‌మరార్‌ నిర్మాతగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 55రోజుల డేట్స్‌ను పవన్‌ కేటాంచాడు. ఈ చిత్రం తర్వాత పవన్‌.. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో హ్యట్రిక్‌ మూవీ రూపొందనుంది. డిసెంబర్‌లోనే ముహూర్తం జరుపుకునే ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 100కోట్లకు పైగా ఖర్చుతో అంటే 'నాన్‌ బాహుబలి' రికార్డులను బద్దలు కొట్టేయాలని త్రివిక్రమ్‌, రాదాకృష్ఱలు ఉన్నారు. కాగా 'జల్సా'తో కామెడీని, 'అత్తారింటికి దారేది' తో ప్యామిలీ ప్రేక్షకులను అలరించిన ఈ కాంబో మూడో చిత్రం మాత్రం ఓ పొలిటికల్‌ బేస్‌డ్‌ సినిమాగా రూపొందనుందని సమాచారం. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ కాకుండానే పవన్‌ చిత్రం ఆయన పొలిటికల్‌ ఇమేజ్‌ను మైలేజ్‌ను పెంచేలా త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ టైటిల్‌ను కన్‌ఫర్మ్‌ చేసినా చేయకపోయినా ఇదే టైటిల్‌ వర్కింగ్‌ టైటిల్‌ కావడం ఖాయం అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం త్రివిక్రమ్‌ ఈచిత్రం స్క్రిప్ట్‌ కోసం బిజీగా గడుపుతున్నాడు. వాస్తవానికి 'అ..ఆ'కు, పవన్‌ సినిమాకి మధ్య త్రివిక్రమ్‌ ఓ మీడియం రేంజ్‌ హీరోతో ఓ చిత్రం చేయాలనుకున్నాడు. దానికి గాను త్రివిక్రమ్‌కు 10కోట్లు రెమ్యూనరేషన్‌ ఇవ్వడానికి కూడా ఈ చిత్ర నిర్మాతలు ఆఫర్‌ చేశారు. కానీ పవన్‌ స్క్రిప్ట్‌కు మరింత శ్రద్దగా పని చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ నో చెప్పాడట. కాగా పవన్‌ను ఆయన అభిమానులే కాదు.. త్రివిక్రమ్‌ సైతం పవన్‌ని దేవుడిగానే కొలుస్తున్నాడు. సో.. ఈ చిత్రానికి 'దేవుడే దిగివచ్చినా' అయితేనే బాగుంటుందని పవన్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ