Advertisementt

విక్రమ్ కి ఇక్కడ బోరుకొట్టినట్టుంది ?

Wed 05th Oct 2016 08:24 PM
vikram,i,inkokkadu,dont breth remake,hollywood movie.  విక్రమ్ కి ఇక్కడ బోరుకొట్టినట్టుంది ?
విక్రమ్ కి ఇక్కడ బోరుకొట్టినట్టుంది ?
Advertisement
Ads by CJ

 

ప్రముఖ నటుడు కమల్ హాసన్ తర్వాత కోలీవుడ్ లో మంచి ప్రయోగాత్మక పాత్రలు చేయగల సత్తా ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విక్రమ్. ప్రధానంగా విక్రమ్ ’ సినిమాపై పెట్టిన ఎఫర్ట్ ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినిమాలో ఆయన పాత్ర కోసం చేసిన కృషి కానీ, నటన కోసం పడ్డ పాట్లుగానీ సంచలనం రేపినవనే చెప్పాలి. ఈ మధ్యనే ఇరుమగన్  సినిమాతో మరో ప్రయోగాన్ని చేసిన విక్రమ్ అది హిట్ అయింది. తెలుగులో కూడా ఇంక్కొక్కడుపేరుతో  ఈ చిత్రం విడుదలైంది. అయితే విక్రమ్ ఇప్పుడు ఓ హాలీవుడ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డాడట. హాలీవుడ్ లో బాగా పాపులరై సంచలనం రేపింది ఆ చిత్రం. డోంట్ బ్రేథ్ అనే పేరుతోహర్రర్ సినిమాగా విడుదలై అక్కడ సంచలనం సృష్టించింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రం మిలియన్ కోట్లతో తెరకెక్కిస్తే ఏకంగా 120 మిలియన్ కోట్ల రూపాయలను రాబట్టి వసూళ్ల సునామీని సృష్టించింది. 
అయితే ఇప్పుడు డోంట్ బ్రేథ్ అనే ఈ సినిమాలో హీరో పాత్ర విక్రమ్ కు బాగా నచ్చేసిందంట.అందుకని వెంటనే ఆయన మదిలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలన్న ఆలోచనలో పడినట్టు తెలుస్తుంది. ఆ దిశగా విక్రమ్ అడుగులు వేస్తున్నాడని పరిశ్రమ వర్గాల టాక్ నడుస్తుంది. కానీ ఈ చిత్రాన్ని రీమేక్ చేసి తమిళంలోనే కాకుండా తెలుగుహిందీ భాషల్లో ఒకే సమయంలో చేసేసి విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. కాగా విక్రమ్ తీసుకున్న ఈ నిర్ణయం మరో సంచలనాన్ని సృష్టించేదిగా కనబడుతుంది
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ