Advertisementt

లోకేష్ సర్వం తానై పోయాడా?

Wed 05th Oct 2016 07:23 PM
chandra babu naidu,lokesh,ttdp fire brand revanth reddy,telugu desam party.  లోకేష్ సర్వం తానై పోయాడా?
లోకేష్ సర్వం తానై పోయాడా?
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ రాజధానితో పాటు, సొంత ఇంటిని నిర్మించడం వంటి కీలకమైన పనులన్నీ చినబాబుకే విడిచిపెట్టినట్లుగా పెదబాబు తెల్పాడు. అయితే తెలంగాణ తెదేపా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి, చంద్రబాబును ఇంటికి సంబంధించిన విషయాలు అడుగగా బాబు అలా స్పందించాడు.  అన్ని ప‌నులు చక్కబెట్టేందుకు లోకేష్‌ కే వదిలిపెట్టాను? చినబాబు ఏం చేశాడో? ఏం చేస్తున్నాడో? అదంతా ఆయనకే తెలియాలి. తాను నిమిత్తమాత్రుడనే అంటూ వెల్లడించాడు బాబు. తాను హైదరాబాద్ గానీ, విజయవాడ గానీ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాను. అన్నీ తానై చినబాబు చేసేస్తున్నాడు అని లోకేష్ అంతటి శక్తిమంతుడంటూ బాబు మనసులో మాటను బయటపెట్టాడు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కొత్త రాజ‌ధానిని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా హైద‌రాబాద్ లో కొత్త ఇల్లు కూడా క‌ట్టుకుంటున్నాడు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని త‌న సొంత ఇంటిని కూల్చేసి అదే స్థ‌లంలో కొత్త ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించిన అన్ని ప‌నులు పూర్త‌య్యాయి. ఇక మంచి రోజు చూసుకుని గృహప్ర‌వేశం చేసుకోవడమే మిగిలింది. ఇదే విషయంపై చంద్రబాబు స్పందిస్తూ.. ఇంటి ప‌నులు మొత్తం లోకేష్ ద‌గ్గ‌రుండి చూసుకున్నాడు. లోకేష్ ఎప్పుడు కొత్తింట్లో కాలి పెట్టమని చెప్తే అప్పుడే వచ్చి కాలు పెడ‌తా. అంతే గానీ ఆ ఇంటి విషయంలో మీకెంత తెలుసో. నాకూ అంతే తెలుస‌ని వివరించాడు. కాగా దసర పండుగ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని బాబు కుటుంబం కొత్తింట్లోకి ప్రవేశించనుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ