Advertisementt

నయనతార ప్రత్యేక పూజలు దేనికోసం..?

Wed 05th Oct 2016 06:18 PM
nayanthara,vignesh sivan,nayanthara love and marriage,nayanthara special poojas  నయనతార ప్రత్యేక పూజలు దేనికోసం..?
నయనతార ప్రత్యేక పూజలు దేనికోసం..?
Advertisement
Ads by CJ

అందాల భామ నయనతార ‘ఇరుమగన్’ సినిమాతో మరో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కోలీవుడ్ లో అమిత జోరుగా సినిమాలు చేస్తున్న ఈ సుందరి దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య వీరిద్దరూ కలిసి జోష్ గా షికార్లు చేస్తున్నారు. ఈ జోడి హుషారుషా ప్రేమలోకంలో పయనిస్తున్నారు.

నయన తారకు ఈ మధ్య కొత్త భయం పట్టుకుంది.  ఇప్పటికే రెండు ప్రేమకథలు నడిపిన నయన్ ఇప్పుడు ఈ ప్రేమ ఏమౌతుందోనని కంగారు పడిపోతుంది. ఆ భయంతోనే ఈ మధ్య ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయించింది.  అందుకు తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి అక్కడ తులాభారాన్ని వేసింది. అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంది. ప్రస్తుతం తను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్ శివన్ తో తన ప్రేమ ఫలించాలని తమ పెళ్ళికి ఎటువంటి విఘ్నాలు జరగకూడదని కోరుకుందట. ఇంకా అతడికి మంచి అవకాశాలు రావాలంటూ కూడా ఈమె పూజలు చేసిందని వినికిడి. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా నయనతార చేస్తున్న ఈ పూజలు కోలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ