'బాహుబలి 2' ప్రెస్‌మీట్‌లో ప్రభాస్ గురించి అక్టోబర్ 5న ఓ గ్రేట్ న్యూస్ తెలియబోతుందని, అది అతని పెళ్లి గురించి కాదని, అలాగే అతని తర్వాత సినిమా గురించి కాదని దర్శ ధీరుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అతను చెప్పిన మరుసటి రోజే..అంటే రాజమౌళి చెప్పిన డేట్ కంటే 4 రోజుల ముందే..ఆ గ్రేట్ న్యూస్ బయటికి వచ్చేసింది. అదేంటంటే..బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ అమరేంద్ర బాహుబలి రూపంలో ఉన్న మైనపు విగ్రహాన్ని పెట్టబోతున్నారు. ఈ మ్యూజియంలో ఇంతకు ముందు ఈ గౌరవం పొందిన వారు మన భారతదేశం నుండి ఇద్దరే ఇద్దరు. ఒకరు మహాత్మా గాంధీ. మరొకరు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మూడవ స్థానం ప్రభాస్ దే. మరి ఇంతటి అత్యున్నత గౌరవాన్ని పొందిన ప్రభాస్ గురించి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకోవాలి. కానీ ఎక్కడా ఆ రెస్పాన్సే లేదు. కనీసం తన తోటి కళాకారులు కూడా ట్విట్స్ రూపంలో కంగ్రాట్స్ చెప్పిన సందర్భం కూడా ఇప్పటి వరకు లేదు. అంటే దీన్ని బట్టి ఏం అర్ధం చేసుకోవాలి. ఈ గౌరవానికి ప్రభాస్ అర్హుడు కాదనా..! లేదంటే పండుగ చేసుకోవాల్సిన ఫ్యాన్స్ కూడా ఇంత వరకు ఎటువంటి హడావుడి చేయలేదు. లేదా..అసలు ఈ మైనపు విగ్రహం గురించి ఎవరికీ పెద్దగా తెలియలేదా..! లేదా ప్రభాస్ తరుపు వాళ్లు..దీనికి గురించి ఫ్యాన్స్‌కి, ఫిల్మ్ ఇండస్ట్రీకి తెలియపర్చాల్సిన రీతిలో తెలియపర్చలేదా..! ఏదీఏమైనా..ఇంతటి ఘనత పొందిన ప్రభాస్‌ని అభినందిస్తూ..కనీసం తెలుగు సినిమా ఇండస్ట్రీ తరుపు నుండి కూడా ఎటువంటి ప్రెస్‌నోట్ విడుదల కాకపోవడం నిజంగా విడ్డూరమే మరి.