Advertisementt

ఉగ్రవాదంపై బాలయ్య పంచ్ డైలాగ్..!

Mon 03rd Oct 2016 08:44 PM
balakrishna,terrorist attacks,balakrishna serious,balakrishna punch on pak terrorism  ఉగ్రవాదంపై బాలయ్య పంచ్ డైలాగ్..!
ఉగ్రవాదంపై బాలయ్య పంచ్ డైలాగ్..!
Advertisement
Ads by CJ

భారత సైనికులు సరిహద్దు రేఖను దాటి పాకిస్తాన్ ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై స‌ర్జిక‌ల్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. దాంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎప్పుడైనా, ఏ క్షణంలోనైనా ఇరు దేశాల మధ్య యుద్ధం జరగొచ్చు అన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. భారత్ కు ధీటుగా మొసలి గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ పాక్ కూడా కయ్యానికి కాలు దువ్వుతుంది. కాగా ప్రముఖ టాలీవుడ్ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల‌కృష్ణ పాక్ ఉగ్రవాదంపై విరుచుకు పడ్డాడు.

ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అస్సలు సహించేదే లేదని బాలకృష్ట వెల్లడించాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ఉగ్రవాదులపై చెలరేగి పోయాడు. పాక్ ఉగ్రవాదం హద్దుమీరితే ధీటుగా బుద్ధి చెప్పాల్సి ఉంటుందని, సహనం అనేది కొంత వరకే ఉంటుందని ఆయన తెలిపాడు. ‘ర‌క్తానికి జాతి ఉండదూ, మాంసానికి మ‌త‌ము ఉండ‌దూ, చ‌ర్మానికీ కుల‌ము ఉండ‌దు’ అని గొప్ప డైలాగ్ తో గట్టి పంచ్ వేశాడు. భారతదేశం ప్రజాస్వామ్యానికి ఆ విలువలకు క‌ట్టుబ‌డి ఉంటుంద‌నీ, భారత ప్రజలకు ఓర్పు, సహనం వంటివి ఎక్కువని, సహనమే భారతీయ సంస్కృతిలో భాగమని ఆయన వివరించాడు. కానీ ఉగ్రవాదాన్ని ఇక భరించే ప్రసక్తి లేదని, పాక్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మలుచుకోవాలని బాలయ్య బాబు తీవ్రంగా మండిపడ్డాడు.  అలా కాకుండా ఉగ్ర‌వాదులు ఇలాగే రెచ్చిపోతే ధీటైన స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని హెచ్చరించాడు.  అయితే బాలకృష్ణ ఉగ్రవాదంపై చేసిన కామెంట్స్ కు  సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలకృష్ణ తొడకొడితే ఉద్రవాదులు ఉలిక్కిపడి పోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ