Advertisementt

రూమర్స్ అన్నింటికీ చైతూ చెక్ పెట్టేశాడు!

Mon 03rd Oct 2016 06:25 PM
naga chaitanya,samantha,rumors,naga chaitanya with samantha,caste change  రూమర్స్ అన్నింటికీ చైతూ చెక్ పెట్టేశాడు!
రూమర్స్ అన్నింటికీ చైతూ చెక్ పెట్టేశాడు!
Advertisement
Ads by CJ

గత కొన్ని రోజులుగా నాగ చైతన్య  కోసం సమంత తన మతం మార్చుకోవడానికి  సిద్ధమైందని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారానికి ఊతమిచ్చేలా ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది అదేమిటంటే నాగ చైతన్య, సమంతలు యేవో పూజలు చేస్తున్నట్టు సోషల్ మీడియా లో కొన్ని ఫోటోస్  లీక్ అయ్యాయి. ఇక ఆ ఫొటోస్ చూసిన వారంతా సమంత క్రిస్టియన్ కాబట్టి అక్కినేని వారికి అభ్యంతరం ఉండడం వలన  ఆమె శాస్త్రోక్తం గా మతం మార్చుకుందని ఒకటే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలక్కడ ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలియదు కానీ ఎవరికి తోచినట్టు వారు ఊహించేసుకుని మీడియాలో  రచ్చ రచ్చ చేశారు. ఒకరు ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే మరొకరు సమంతకి దోషనివారణ పూజలు జరిగాయంటూ ప్రచారం మొదలెట్టారు.

అయితే తాజాగా నాగ చైతన్య, సమంత పూజలు గురించి వస్తున్న వార్తలకి స్పందించాడు. సమంత మతం మార్చుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని...అసలు తనకి మతం మార్చుకోమని నేను చెప్పనని తేల్చి చెప్పేసాడు. ఇక ఆ ఫొటోస్ గురించి మాట్లాడుతూ  సమంత నేను కలిసి ఒకసారి అన్నపూర్ణ స్టూడియా కి వెళ్లేసరికి నాన్నగారు యేవో పూజలు చేపిస్తూ వున్నారని మేము అదే టైం కి అక్కడికి వెళ్లడం తో మాతో కూడా పూజ చేయించారని చెప్పాడు. ఆ ఫొటోస్ తో మా ఎంగేజ్మెంట్ అయిపోయిందని... లేక సమంత మత మార్పిడి పూజలు ఫొటోస్ అనుకున్నారు కానీ అదేం కాదని సెలవిచ్చాడు.  

ఇక పెళ్లి తర్వాత సమంత సినిమాలో నటిస్తుందా అనడిగితే దానికి కూడా నాగ చైతన్య సమాధానం చెప్పాడు. అదేమిటంటే సమంత చాలా కష్టపడి సొంత గుర్తింపు తెచ్చుకుందని.... సినిమాల్లో కూడా బాగా పైకొచ్చిందని అలాంటి సమంత ని నేనెలా సినిమాలు మానెయ్యమని చెప్తానని చెప్తున్నాడు. నాకంటే తానె ఎక్కువగా సినిమాల్లో నిలదొక్కుకోవడానికి కష్టపడిందని.... తాను ఏం చెయ్యాలనుకున్న సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇంకేముంది పెళ్లైయ్యాక కూడా సినిమాల్లో సమంత నటిస్తుందని నాగ చైతన్య క్లియర్ గా చెప్పేసాడు. ఇక  ఇలా చెప్పి రూమర్స్  కి చెక్ పెట్టేసాడు చైతు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ