Advertisementt

అదరగొడుతున్న 'ధోని'....!

Mon 03rd Oct 2016 04:47 PM
m.s.dhoni movie,collections,first week,box office collections,heist openings  అదరగొడుతున్న 'ధోని'....!
అదరగొడుతున్న 'ధోని'....!
Advertisement
Ads by CJ

ఈ చిత్రంలో స్టార్‌లు నటించలేదు. కేవలం ఎలాంటి మార్కెట్‌లేని సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇందులో నటించాడు. కాగా క్రికెట్‌ను ఓ మతంలా భావించే ఇండియాలోనే కాదు.. ఇతర ఓవర్‌సీస్‌లలో కూడా 'ఎం.ఎస్‌.ధోని' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం ధోనిపట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ వల్లనే ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు సల్మాన్‌ఖాన్‌ నటించిన 'సుల్తాన్‌' చిత్రం తర్వాత ఈ చిత్రమే భారీ ఓపెనింగ్స్‌ తెస్తున్న చిత్రంగా నిలుస్తోంది. విడుదలైన రెండు రోజుల్లో 50కోట్లకు పైగా కలెక్షన్లను సాధిస్తోంది. ఇక ఈ చిత్రం విడుదలైన తమిళ, తెలుగు భాషల్లో కూడా కలెక్షన్లు బాగా ఉన్నాయి. ఈ వీకెండ్‌ 'ధోని' చిత్రానికి అడ్డుపడే చిత్రం లేకపోవడం... ఈ చిత్రానికి మంచి ప్లస్‌ అయింది. ఈ హవా ఈ వారాంతం వరకు జోరుగా సాగనుంది. మొత్తానికి 'ఎం.ఎస్‌.ధోని' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలను సృష్టిస్తోంది. మూడు గంటల నిడివి ఉన్న చిత్రమైనా సరే... ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. వివాదాలను తాకకుండా ధోని ఇమేజ్‌ను మరింతగా పెంచే చిత్రం గా... ఈ చిత్రానికి క్రికెట్‌, సినీ అభిమానుల ఆదరణ లభిస్తోంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ