కాపు గర్జన సందర్భంగా జరిగిన తుని సంఘటన నేపథ్యంలో జరిగిన విధ్వంసకాండకు వైసీపీని బాధ్యురాలిని చేయాలని టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ప్రస్తుతం సిఐడి విచారిస్తోంది. ఈ విచారణలో భాగంగా భూమన కరుణాకర్‌రెడ్డిని సిఐడి ఇప్పటికే మూడు సార్లు విచారించింది. భూమనతో పాటు కుట్రలో జగన్‌ని కూడా బాధ్యుడిని చేయడం ద్వారా జగన్‌పై విధ్వంసకారుడు అనే ముద్రను మరింత బలంగా నిలిపేందుకు టిడిపి నాయకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు టిడిపి ముందస్తు వ్యూహం ప్రకారం చేసిందని, తమను ఇరికించేందుకు టిడిపి మొదటి నుండి కుట్రపన్నిందని వైయస్సార్‌సీపీ నాయకులు అంటున్నారు. కానీ ఇందులో నిజం లేదని, చంద్రబాబుపై ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం నిప్పు అంటూ తమకు తామే సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు టిడిపి నాయకులు. మొత్తానికి తుని ఘటన అసలు విషయాలను, నిజాలను వెలికితీయకుండా కేవలం ఒకరిని ఒకరు ఈ వివాదంలో బాధ్యులని చేయాలని టిడిపి, వైసీపీలు ఆడుతున్న నాటకంగా ప్రజాస్వామ్య వాదులంతా ఈ పరిణామాలను విశ్లేషిస్తున్నారు.