Advertisementt

'బాహుబలి'తో పోల్చుకోవడం మానాలి!

Sat 01st Oct 2016 09:46 PM
bahubali,kushboo,sundar c,robot 2,shankar,kabali,puli  'బాహుబలి'తో పోల్చుకోవడం మానాలి!
'బాహుబలి'తో పోల్చుకోవడం మానాలి!
Advertisement
Ads by CJ

దేశ విదేశాలలో కూడా 'బాహుబలి' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం తర్వాత పెద్ద పెద్ద చిత్రాల నిర్మాతలు కూడా తమది బాహుబలి స్దాయి చిత్రమని, అంతే బడ్జెట్‌తో తమ చిత్రాలను తీస్తున్నామని పోలికలు పోలుస్తున్నారు. 'బాహుబలి'నే స్ఫూర్తిగా తీసుకొని విజయ్‌ నటించిన 'పులి' చిత్రం పరిస్థితి ఏమైందో అందరి తెలిసిందే. ఇక 'కబాలి' తో పాటు పలు చిత్రాలను బాహుబలికి పోటీగా కోలీవుడ్‌ వాసులు పోల్చారు. ఇక ఇప్పుడు నటి ఖుష్భూ భర్త సుందర్‌ సి. తన వరుస ప్లాప్‌ల నేపథ్యంలో 350కోట్లతో మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయాలని ఉబలాటపడ్డాడు. కానీ కథను, దర్శకుడిని నమ్మలేక ఆయన ఆ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్‌ చేశాడు. ఇప్పుడు ఆ స్దానంలో హీరో విజయ్‌ కోసం ప్రయత్నించాడు. కానీ ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌కు నో చెప్పేశాడు. ఈ చిత్రం ఇద్దరు హీరోల నేపథ్యంలో జరుగుతుందట. ఒకహీరోగా ఆర్యను తీసుకున్న సుందర్‌ రెండో హీరో పాత్ర కోసం ఇప్పుడు జయం రవి దగ్గరకు వెళ్లాడు. ఎవరేమనుకున్నా.. కేవలం శంకర్‌ తీస్తున్న 'రోబో2.0' పైనే కోలీవుడ్‌ ఆశలన్నీ నిలిచివున్నాయి. కలెక్షన్లపరంగా ఈ చిత్రానికి మాత్రమే బాహుబలిని దాటే సత్తా ఉందని కోలీవుడ్‌ విశ్లేషకులు అంటున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ