పవన్ కళ్యాణ్ రాజకీయాలకి, సినిమాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ రెండింటిని ఒక్క చేత్తో హ్యాండిల్ చేయడానికి సిద్ధమై పోయాడు. అటు రాజకీయాల్లో బిజీగా తన యాక్టివిటీస్ ని ప్రారంభించిన పవన్ ఇటు సినిమాల విషయం లో కూడా అదే స్పీడు ని కంటిన్యూ చెయ్యాలని డిసైడ్ అయ్యి.... 'కాటమరాయుడు' చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాని డాలి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి.... ఇంకా ఇందులో నటించే నటీ నటులు ఎంపిక పూర్తి కాలేదు. ఇందులో పవన్ కి తమ్ముళ్లు గా నటించే నటుల్ని ఎంపిక చెయ్యడం పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. ఇప్పటికే చాలామంది యువ హీరోలను సంప్రదించగా వారు ఒప్పుకున్నట్టే ఒప్పుకుని ఇప్పుడు చెయ్యమని చెప్పారని అంటున్నారు.
ఇప్పటికే 'పెళ్లి చూపులు' హీరో విజయ్ ని అడగగా ముందు ఎగిరి గంతేసి తర్వాత మెల్లగా 'కాటమరాయుడు' టీమ్ కి హ్యాండిచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇక మరో హీరో రాజ్ తరుణ్ పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. వీరు అసలు ఎందుకు 'కాటమరాయుడు' సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు వీరు తిరస్కరించారో మీరే చూడండి... ఈ సినిమాలో పవన్ తమ్ముళ్లుగా చేసే కేరెక్టర్స్ కి పెద్దగా స్కోప్ ఉండదనే అపోహ వల్ల వీళ్ళు ఈ ఆఫర్ని తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హీరోలుగా ఎదుగుతున్న వీరు ఈ సినిమాలో గనక నటిస్తే తమ ఇమేజ్ దెబ్బ తింటుందనే భయం తో ఇలా చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉండగా దర్శకుడు డాలి ఇప్పటికే పవన్ తమ్ముళ్లుగా కొంతమందిని సెలెక్ట్ చేసాడని అంటున్నారు. వారిలో అజయ్, శివ బాలాజీ, కమల కామరాజులు ఉన్నట్లు సమాచారం. వీరిలో అజయ్ ఇప్పటికే పవన్ కి తమ్ముడిగా 'గబ్బర్ సింగ్' సినిమాలో చేసి ఉన్నాడు. వీరు ముగ్గురు ఫైనల్ అని డాలి చెబుతున్నాడు. అయితే ఇక పవన్ కి తమ్ముళ్లు దొరికినట్టేగా. ఇంతవరకు పవన్ ఇలాంటి సమస్యని ఎప్పుడూ ఎదుర్కొని ఉండలేదట. మొదటి సారిగా 'కాటమరాయుడు' సినిమా కోసం ఇలా నటుల ఎంపిక సమస్యగా మారిందని అంటున్నారు.