తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో బాధపడుతూ గత పదిరోజులుగా అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా కొన్ని రోజుల నుండి ఆమె ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ లు గానీ, ఎటువంటి ప్రకటనలు గానీ విడుదల చేయకపోవడంపై జయలలిత ఆరోగ్యంపై అందరిలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ విషయం ఇప్పుడు ఉత్కంఠకు దారితీస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా తమిళనాడు ప్రభుత్వం జయలలిత ఆరోగ్యంపై ఎటువంటి సమాచారాన్ని బయటకు తెలియపరచడం లేదు. దానికి కారణం జయలలిత ఆసుపత్రికి వెళ్ళే ముందు తన గురించి ఏ సమాచారం బయటికి తెలియకుండా చూడండి అంటూ సూచించినట్లుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. అందువల్లనే జయలలితకు భయపడి నేతలంతా కూడా ఆమెకు సంబంధించిన ఏ సమాచారాన్ని తెలియపరచడం లేదని తెలుస్తుంది. జయలలిత ఆరోగ్యంపై ప్రతిపక్ష నేత అయిన కరుణానిధి ఆందోళన పడటంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా కదిలింది. జయలలిత ఆరోగ్యం విషయం వెంటనే బయట పెట్టాలని కరుణానిధి డిమాండ్ చేయడంతో ఆమె ఆరోగ్యం విషయం సంచలనానికి దారితీస్తూ రకరకాల ఉహాగానాలకు చెలరేగుతున్నాయి.
అయితే తాజాగా చెన్నైలోని అపోలో ఆసుపత్రి ఆవరణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించడంతో ఇంకా ఆందోళనలు ఎక్కువయ్యాయి. లండన్ నుండి ప్రత్యేకంగా వచ్చిన వైద్యుడు రిచర్డ్ జాన్ ఆమెకు ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో జయలలితతో పాటు ఐసీయూలోనే ఆమె సన్నిహితురాలైన శశికళ ఉంటూ అన్నీతానై చూసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. శశికళ ఇంటికి కూడా వెళ్ళకుండా ఆసుపత్రికే పరిమితమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో రాజకీయ వర్గాలతో పాటు ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నప్పటికీ బయటికి ప్రకటించకపోవడంపై అనుమానాలకు తావిస్తుంది. ఏ విషయాన్ని అయినా మీడియాకు చెప్పేందుకు మాత్రం అంతా వెనకంజ వేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ప్రాన్స్ మహిళ జయలలిత ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందంటూ పేస్ బుక్ లో కామెంట్ పోస్ట్ చేసింది. దీనితో అన్న డీఎంకే ఐటి కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదిఏమైననప్పటికీ తమిళనాడు ప్రభుత్వం జయలలిత ఆరోగ్యంపై నిజాలు వెల్లడించడం లేదన్నది మాత్రం నిజం.