Advertisementt

మహేష్ ఫైట్ ఖరీదు ఎంతో తెలుసా..?

Sat 01st Oct 2016 06:18 PM
prince mahesh babu,ar murugadoss,3 crores cost to one fight,mahesh babu and murugadoss movie  మహేష్ ఫైట్ ఖరీదు ఎంతో తెలుసా..?
మహేష్ ఫైట్ ఖరీదు ఎంతో తెలుసా..?
Advertisement
Ads by CJ

మ‌హేష్ బాబు మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో భారీ అంచనాలతో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సెట్స్ పైకి వెళ్ళక ముందే వీరిద్దరి కాంబినేషన్ లోని ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఈ చిత్రంపై రోజు రోజుకీ అంచ‌నాలూ పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కోసం ఓ యాక్ష‌న్ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించ‌నున్నట్లు తెలుస్తుంది. ఈ ఫైట్ పై చిత్ర నిర్మాత ఏకంగా రూ. 3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్ష‌న్ సీన్‌ ప్రధానంగా బోట్ డ్రైవింగులూ, కార్ ఛేజింగులతో కూడుకొని ఉండి హాలీవుడ్ స్థాయిలో స్టంట్ కంపోజ్ చేస్తున్నారని తెలిస్తుంది. అయితే ఈ యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాలో మిడిల్ లోనా ఎండ్ లోనా అన్నది తెలియడం లేదు. మురుగ‌దాస్ సినిమాలకు వాడే యుద్ధ సన్నివేశాలు చాలా స‌హ‌జంగా, సింపుల్‌గా ఉంటాయి. మహేష్ బాబు కెరీర్ లోనే ఒక్క ఫైట్ కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం విశేషమనే చెప్పాలి. కేవలం ఈ ఒక్క ఫైట్ కోసమే  దాదాపు 12 రోజులు కాల్షీట్లు  మహేష్ బాబు కేటాయించినట్లుగా తెలుస్తుంది. కాగా ఈ ఫైట్ అంతా కూడా హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ సమక్షంలోనే చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా బ‌డ్జెట్ రూ.100 కోట్లని సమాచారం అందుతుంది. కానీ ఒక్క ఫైట్ కోసమని రూ. 3కోట్ల ఖర్చు చేస్తుండటంతో దీనిపై సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ