భారత ప్రధాని నరేంద్ర మోడి రూటే సపరేటు. కష్టపడి ఎదిగిన వ్యక్తికి కష్టాలంటే ఏంటో తెలుస్తాయి. అతి సాధారణ కుటుంబంలో నుంచి అంచలంచెలుగా ఎదిగి ప్రధాని స్థాయి పదవిని అలంకరించిన నరేంద్ర మోడికి సమాజంలోని వాస్తవ పరిస్థితులు ఏంటో బాగా తెలుసు. అలాంటి వ్యక్తి కాబట్టే సమసమాజమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు ప్రధాని నరేంద్ర మోడి. భారత ప్రధానిగా అన్ని వర్గాలను సమాదరణతో చాలా మెలకువతో ప్రతివిషయంలోనూ ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తున్నాడు.
సమాజం ఎలా మారిందంటే అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తికి ఇచ్చే మర్యాద వేరు. అధికారంలో లేనప్పుడు వ్యక్తికి దక్కే మర్యాద వేరుగా ఉంటుంది. సమాజాన్ని చదివి సమాజం పట్ల, సామాజికుల పట్ల పూర్తి అవగాహనతో వ్యవహరిస్తున్న మోడీ ఆ దిశగా తన్ను తాను సంస్కరించుకుంటున్నాడు. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న ఎవరినైనా గౌరనీయులైన అనిగాని, మాన్యులు అని గానీ సంబోధించడం పరిపాటి. ఇప్పుడు అలాంటివేం అక్కరలేదన్నట్లుగా ప్రధాని మోడి కార్యాలయం నుండి ఓ ప్రకటన వచ్చింది. కేవలం తనను ప్రధాని మోడి అంటే సరిపోతుందని, ఎలాంటి గౌరవాలు అక్కరలేదని సారాంశంగా తెలుస్తుంది. గౌరవాలు ఉండటం కారణంగా తాము సామాన్యుడికి దూరం అవుతున్నామన్నది మోడీ అభిప్రాయం కాబోలు అని విశ్లేషకులు భావిస్తున్నారు.