కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి అతని కెరీర్ లో తిరుగులేని హిట్ పడింది. కలెక్షన్స్ లో కూడా ఇండస్ట్రీ లో టాప్ 3 స్థానం జనతా వశమైంది. ఈ సినిమా సెప్టెంబర్ 1 తేదీన రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక రెండు మూడు వారల పాటు మరే ఇతర గట్టి సినిమా లేకపోవడం తో ఈ కలెక్షన్స్ సాధ్యమైయ్యాయని లేకుంటే 'జనతా గ్యారేజ్' టాప్ 3 ప్లేస్ కి రావడం కష్టమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక 2, 3 వారాలు గట్టి పోటీ ఏం లేకుండా కలెక్షన్స్ తో దున్నేసిన 'జనతా'.. తాజాగా విడుదలైన 'మజ్ను' సినిమా తో కలెక్షన్స్ వర్షానికి బ్రేక్ పడింది.
ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 4 వారాలు అయ్యింది. 5 వ వారం రన్ అవుతుంది. అయితే ఇప్పటికీ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టే కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా ఆడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాని అప్పుడే టీవీల్లో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారని టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసిన మా టీవీ వారు 'జనతా గ్యారేజ్' 50 రోజులు పూర్తి చేసుకున్న వెంటనే తమ ఛానెల్ లో ఈ సినిమాని టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారట. ఆ సినిమా ప్రదర్శించే డేట్ ని కూడా మా టీవీ అప్పుడే అనౌన్స్ చేసేసిందట. అక్టోబర్ 23 న ఈ సినిమా మా టీవీలో చూడొచ్చని అంటున్నారు. ఈ సినిమా రైట్స్ ని మాటీవీ 10.50 కోట్లకి కొనుగోలు చేసింది.
నేటి సినిమాలకు ఎలాగూ 100 రోజులు ఆడే పరిస్థితి లేదు కాబట్టి.. ఇలా 50 రోజులు పూర్తవ్వగానే సినిమాలను టీవీల్లో టెలికాస్ట్ చేసేస్తే పైరసీ బాధ కూడా తగ్గుతుంది. అలా పైరసీల్లో చూసే వారు కూడా ఎంచక్కా ఇలా ఇంట్లో కూర్చొని ఒరిజినల్గా, క్వాలిటీగా సినిమా చూస్తూ ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇలా టీవీలో తొందరగా సినిమాని టెలికాస్ట్ చేస్తే సినిమా తీసిన నిర్మాతలు కూడా సినిమాలను పైరసీ నుండి కాపాడిన వారు అవుతారు. దీనిద్వారా పూర్తిగా పైరసీ ని అరికట్టలేక పోయినా..కొంతలో కొంత వరకు నిర్మాత సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. పెద్ద సినిమాలు సంగతి ఇలా ఉంటే..చిన్న సినిమాల నిర్మాతలు కూడా..టీవీ యాజమాన్యం తో సంప్రదిస్తే..నిర్మాతల కష్టాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో..మొత్తానికి వీక్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'జనతా గ్యారేజ్' ఇప్పుడు బుల్లితెర పై కూడా సంచలనం కాబోతుందన్నమాట.