Advertisementt

పవన్ తో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా!

Fri 30th Sep 2016 07:57 PM
pawan kalyan,koratala siva,pawan kalyan and koratala siva movie on cards,pawan politics,prabhas,mahesh,ntr  పవన్ తో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా!
పవన్ తో ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ కొరటాల శివ తానూ  డైరెక్షన్ మొదలు పెట్టినప్పటి నుండే స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ ఇస్తూ పోతున్నాడు. ఆయనకి మొదటి అవకాశమే ప్రభాస్ వంటి హీరో తో వచ్చింది. ఇక వెనువెంటనే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసి టాప్ పొజిషన్ లోకి చేరుకున్నాడు. ఇక ఇప్పడు కూడా కొరటాల మళ్ళీ మహేష్ బాబు తో సినిమా తియ్యడానికి సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే కొరటాల ఇప్పుడున్న స్టార్ హీరోలందరితో సినిమాలు చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడట. అందుకే పవన్ కళ్యాణ్ తో కూడా భారీ సినిమాని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. 

ఇప్పుడు కమిట్ అయిన మహేష్ సినిమా కంప్లీట్ కాగానే పవన్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎప్పటిలాగే ఈ సినిమా కూడా ఒక సందేశాత్మక చిత్రం గా తియ్యాలని కొరటాల భావిస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ సందేశం తో సమాజానికి ఏదైనా మంచి జరగాలి అనే కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించాలని చూస్తున్న కొరటాలకు..... ఆ సినిమా పవన్ కి రాజకీయాల్లో కూడా హెల్ప్ అయ్యే విధంగా తియ్యాలని  భావిస్తున్నాడట. ఎలాగూ రాజకీయాల్లో యాక్టీవ్ గా మారుతున్న పవన్ కి ఇలా రాజకీయాలకు పనికొచ్చే సినిమా చేస్తే గనక బాగా హెల్ప్ అవుతుందని అంటున్నారు. మరి టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్న కొరటాల కి పవన్ గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ సినిమా ఓకె అయ్యి పట్టాలెక్కితే ఇక ఇప్పుడున్న రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయి ఇండస్ట్రీ లో టాప్ రికార్డు నెలకొంటుందని అంటున్నారు.

మరి ఇటు కొరటాల.. మహేష్ సినిమాకి కథను డెవలెప్ చేసి అతి తొందరలో పట్టాలెక్కించి ఈ సినిమాని పూర్తి చెయ్యాలని చూస్తున్నాడు. మరో వైపు పవన్ 'కాటమరాయుడు' సినిమాని వీలైనంత స్పీడ్ గా కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చెయ్యాలని భావిస్తున్నాడు. మరి వీరిద్దరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఇక వీరి పనులు పూర్తవగానే కొరటాల, పవన్ తో సినిమా ని తెరకెక్కించేందుకు రెడీ అవుతాడని.... అదీ పవన్ ఒప్పుకుంటే అని అంటున్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు కదా!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ