Advertisementt

శ్రీకాంత్ అడ్డాలకు ఈ టాప్ హీరో ఛాన్సిస్తాడా!

Fri 30th Sep 2016 06:04 PM
srikanth addala,top hero,jr ntr,mahesh babu,brahmotsavam,mukunda  శ్రీకాంత్ అడ్డాలకు ఈ టాప్ హీరో ఛాన్సిస్తాడా!
శ్రీకాంత్ అడ్డాలకు ఈ టాప్ హీరో ఛాన్సిస్తాడా!
Advertisement
Ads by CJ

'కొత్త బంగారు లోకం' సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల అతి తక్కువ కాలం లోనే మహేష్ - వెంకటేష్ వంటి స్టార్స్ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని పట్టేసాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకేమిటి అతను కూడా స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయాడు. ఇక వెంటనే మెగా హీరో వరుణ్ తేజ్ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసే బాధ్యతని తీసుకున్నాడు. 'ముకుంద' తో వరుణ్ తేజ ని హీరోగా పరిచయం చేసాడు గాని ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించలేక పోయింది. అయినా కూడా మహేష్ పిలిచి 'బ్రహ్మోత్సవం' సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఆ సినిమాని తెరకెక్కించే విషయం లో ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి ఆ సినిమాని ప్లాప్ ల జాబితాలో చేర్చాడు. ఇక ఆ సినిమాతో మహేష్ బాబుకి డిజాస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల తెగ మదన పడుతున్నాడు.  ఎందుకంటే ఒక డిజాస్టర్ సినిమాని తీసిన తర్వాత ఇక ఏ స్టార్ హీరో తనకి అవకాశం ఇవ్వడానికి ముందుకు రారు కాబట్టి.

ఆయన అలా ఫీల్ అయ్యింది అక్షరాలా నిజమై కూర్చుంది. ఒకప్పుడు టాప్ డైరెక్టర్ అనిపించుకున్న అడ్డాల ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే శ్రీకాంత్ అడ్డాల ఎప్పటి నుండో ఎన్టీఆర్ హీరో గా ఒక సినిమా తియ్యాలనుకుంటున్నాడట. అయితే 'బ్రహ్మోత్సవం' ప్లాప్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల కొన్నాళ్ళు ఎవరికీ కనిపించలేదు. ఇక ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చెయ్యాలని బయలుదేరాడు. మరి అడ్డాల కోరికని ఎన్టీఆర్ మన్నిస్తాడా? లేక ఇప్పటికే హిట్స్ తో జోరుగా దూసుకెళ్తున్న ఎన్టీఆర్ ఈ ప్లాప్ డైరెక్టర్ తో నేను సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తాడా? అనేది చూడాలి.

ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల తన ప్రయత్నాలు మొదలు పెట్టాడని అంటున్నారు. అందులో భాగం గానే ఎన్టీఆర్ కి ఒక స్టోరీ లైన్ వినిపించాడని సమాచారం.  మరి ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా చెప్పుకునే శ్రీకాంత్ అడ్డాల ఈసారి ఫ్యామిలీ లైన్ తో కాకుండా ఒక మాస్ లైన్ తో ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడట. మరి ఎన్టీఆర్ ఆ లైన్ విన్న తర్వాత తన అభిప్రాయాన్ని కొంచెం టైం తీసుకుని చెప్తానని పంపించేసాడని ఫిలిం నగర్ లో ఒకటే గుసగుసలు. మరి ఎన్టీఆర్ ఇచ్చే అవకాశం కోసం శ్రీకాంత్ అడ్డాల కంట్లో వత్తులేసుకుని మరీ ఎదురు చూస్తున్నాడట.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ