Advertisementt

సినీ ఇండస్ట్రీలోనూ కేటీఆర్ దే హవా!!

Fri 30th Sep 2016 10:40 AM
abhishek pictures,ktr,ktr wife,tollywood,abhishek pictures damnation  సినీ ఇండస్ట్రీలోనూ కేటీఆర్ దే హవా!!
సినీ ఇండస్ట్రీలోనూ కేటీఆర్ దే హవా!!
Advertisement
Ads by CJ

ఈ మధ్య కాలంలో అభిషేక్ పిక్చర్స్  హవా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తెగ నడుస్తుంది. ఎక్కడ చూసినా వీరి సినిమాలే ఓపెనింగ్ లు జరుపుకుని సెట్స్ మీదకి వెళుతూ తెగ హడావిడిగా వుంది వీళ్ళ పని. అయితే వీళ్ళింతలా రెచ్చిపోవడానికి కారణం మాత్రం తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ అట. అదేమిటి కేటీఆర్ కి ఈ అభిషేక్ పిక్చర్స్ కి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? అదేమిటి మీకు తెలీదా... కేటీఆర్ గారి భార్య ఈ అభిషేక్ పిక్చర్స్ ని వెనుకుండి నడిపిస్తుందని అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. 

ఇప్పటికే కేసీఆర్ సినిమా రంగం పై తెగ ప్రేమ కురిపించేస్తున్నారు. ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ ఎక్కడ వైజాగ్ లాంటి ప్రదేశాలకు తరలిపోతుందో అని భయపడిన కేసీఆర్ ...తెలుగు సినీ పరిశ్రమ ఎక్కడికి తరలిపోవక్కర్లేదని చెబుతూ వారికి ఏ సహాయం కావాలన్న నేను రెడీ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రం విడిపోయాక కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబందించిన బడా నిర్మాతలు  వైజాగ్, నెల్లూరు వంటి చోట్ల కొంత స్థలాలు కొన్నారు. కానీ ఏమిలేకుండా అక్కడ స్టూడియో లు పెట్టి వాటిని రన్ చెయ్యడం అప్పుడే అంత తేలికైన విషయం కాదని సైలెంట్ అయిపోయారు. ఇంకేముంది కేసీఆర్ పాచిక పారింది. అయితే కేసీఆర్ కొడుకు తండ్రిలా తెలివిగా తెర చాటున ఉండి కొంత మంది నిర్మాతలను ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు.

అలా పుట్టుకొచ్చేందే ఈ అభిషేక్ పిక్చర్స్ అని.... దీనిని కేటీఆర్ భార్య వెనుకుండి అన్నీ చక్కబెడుతుందని చెప్పుకుంటున్నారు. దానిలో మరికొంతమంది తెలంగాణలోని బడా రాజకీయ నేతలు కూడా పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టే అభిషేక్ పిక్చర్స్ అలా రెచ్చిపోతుందని అంటున్నారు. అయితే అసలు ఇప్పుడు ఈ వివరాల్ని ఇలా చెప్పుకోవడానికి కారణం అభిషేక్ పిక్చర్స్ కి ఒక అవార్డు రావడంతో  దీని గురించి ఇంత చర్చజరుగుతోంది. ఐఎఫ్ఎ (ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం బిజినెస్ -2016) అవార్డును ద‌క్కించుకోవ‌డంతో అభిషేక్ పిక్చర్స్ పేరు ఇప్పుడు ప్రధానం గా వినబడుతుంది. ఆ అవార్డు రావడం తో ఆ సంస్థ కార్యాలయంలో పూజలు గట్రా నిర్వహించారట. ఈ కార్యక్రమానికి... కేటీఆర్, బోయపాటి  శ్రీను వంటి పెద్దవాళ్ళు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ