యూరి సెక్టార్‌లో 17 మంది అమర వీర జవాన్‌లను పొట్టనపెట్టుకున్న పాక్‌పై పలు సంఘాలు తీవ్రంగా కన్నెర్రజేశాయి. బాలీవుడ్‌లో ఉంటున్న పాక్ నటీనటులు మన దేశం వదిలి వేరే చోటికి వెళ్లాలని మహారాష్ట్ర నవ నిర్మాణసేన హెచ్చరించిన నేపధ్యంలో బాలీవుడ్‌లో ఉన్న పలువురు పాకిస్తానీ నటీనటులు చెప్పాపెట్టకుండా దేశం విడిచిపెట్టిపోతున్నారు. బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ విషయంలో ప్రభుత్వం ఏది ఫైనల్ చేస్తే దానికి తాము మద్దతు ఇస్తామంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పాకిస్టాన్ నటీనటులకు ఇండియాలో ఏ విషయంలోనూ ఇబ్బందులు ఉండబోవని, వారికి తాము సెక్యూరిటీ కల్పిస్తామని అంటోంది. కానీ దేశంలోని పలు హిందూ దర్మసంస్ధలు, అతివాదులు మాత్రం పాక్ నటీనటులు దేశం విడిచిపోవాలనే మాటకు కట్టుబడి ఉన్నాయి. కాగా ఈ పరిణామం భారతీయ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న పాకిస్దాన్‌లో ఇబ్బంది అవుతుంది. దీంతో వారు బాలీవుడ్ చిత్రాలపై బ్యాన్ పెడుతున్నారు.. దీనికి బలవుతున్న తొలి చిత్రం 'ఎం.ఎస్.ధోని' చిత్రం. ఈ చిత్రాన్ని పాక్‌లో విడుదల కాకుండా బ్యాన్ చేశారు. మొత్తానికి ఈ వివాదం మరెన్నింటికి కారణభూతం కానుందోననే విషయం ఆసక్తిని కలిగిస్తోంది. చివరకు ఈ వివాదం షారుఖ్ మెడకు కూడా చుట్టుకుంది. ఆయన తల్లిదండ్రులతో పాటు ఆయన పూర్వీకులు ఇప్పటికీ పాక్‌లోనే ఉన్నారు. దీంతో ఆయన మాత్రం హిందు అతివాద సంస్దల తీరును నిరసిస్తూవున్నారు.