ప్రస్తుతం తమిళ 'వీరమ్'కు రీమేక్‌గా పవన్‌కళ్యాణ్, డాలీ కాంబినేషన్‌లో 'కాటమరాయుడు' చిత్రం చేస్తోన్నసంగతి తెలిసిందే. కథ ప్రకారం ఈ చిత్రంలో పవన్‌కు నలుగురు తమ్ముళ్లు ఉంటారు. కానీ వీరి పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కాగా మొదట టాలీవుడ్ రీమేక్ విషయంలో పవన్ తనకు తమ్ముళ్లుగా ఇప్పటిి యంగ్ హీరోలను తీసుకోవాలని భావించి అందుకు అనుగుణంగా పలువురి పేర్లు ప్రస్తావించి యంగ్ సక్సెస్‌ఫుల్ హీరోలను ఈ పాత్రలకు తీసుకోవాలని సూచించాడు. శర్వానంద్, 'పెళ్ళిచూపులు' విజయ్, రాజ్‌తరుణ్, నవీన్‌చంద్రలతో పలు పేర్లు ప్రస్తావన తెచ్చారు. కానీ ఈ చిత్రంలో ఎంచుకునే వారి 50రోజుల డేట్స్ బల్క్‌గా కావాల్సివుండటం, అందులోనూ ప్రతి సీన్‌లోనే పక్కన నిలుచోనే క్యారెక్టర్లు కావడం, ఉన్న సీన్స్‌కు కూడా పెద్దగా పర్‌ఫార్మెన్స్ స్కోప్ లేకపోవడంతో ఈ హీరోలందరూ నో చెప్పేశారు. ఒక్క కమల్ కామరాజ్ మాత్రమే ఇప్పటివరకు ఎంపిక చేసిన వారిలో ఉన్నాడు. మరి మిగిలిన మూడు పాత్రలను ఎవరు చేయనున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. పవన్ సినిమా అంటే ఎగిరి గంతేస్తారని భావిస్తూ వచ్చిన దర్శకనిర్మాతలు ఈ విషయంలో పప్పులోకాలేశారని అంటున్నారు.